రాజకీయ వ్యూహకర్త కార్యకర్త ప్రశాంత్ కిషోర్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి సాయం చేసి తప్పు చేశానని, ఆ సమయంలో తాను కాంగ్రెస్ కి సాయం చేసి ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్ ని బతికించాల్సిన అవసరం ఈ దేశానికి ఉందన్నారు.
ఈ సందర్భంగా బిజెపి ఆర్ఎస్ఎస్ కలయికను కాఫీతో పోల్చారు. కాఫీ కప్పు చూసినపుడు అందులో నురుగు పైన ఉంటుంది. కింద ఉన్న కాఫీ… RSS. ఆరెస్సెస్ ను ఏమీ చేయకుండా నురుగు గురించి ఆలోచిస్తే ఏమీ ఉపయోగం ఉండదన్నార.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఇది బీహార్‌లోని సుదీర్ఘమైన “పాదయాత్ర”.
“(నాథూరామ్) యొక్క భావజాలం గ్రహించడానికి తనకు చాలా సమయం పట్టింది. గాంధీ కాంగ్రెస్‌ను పునరుద్ధరించడం ద్వారా మాత్రమే గాడ్సేను ఓడించగలం”. నేను నితీష్, జగన్ వంటి వారికి సహాయం చేసే బదులు ఆ దిశగా పనిచేస్తే బాగుండేది అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. వీరిద్దరికీ పనిచేయడం టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగం లేదన్నారు.
నా టార్గెట్ బీజేపీ. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ ను బతికించాలి. బీజేపీ అంటే ఏమిటో అర్థం చేసుకోని పక్షంలో దాన్ని ఓడించలేమని ఉద్ఘాటించారు.
“మీరు ఎప్పుడైనా ఒక కప్పు కాఫీ వైపు చూశారా? పైన నురుగు ఉంది. బిజెపి అలాంటిది. దాని క్రింద లోతైన నిర్మాణం ఉంది. RSS. సంఘ్ సామాజిక నిర్మాణంలోకి ప్రవేశించింది. ఇప్పుడు షార్ట్‌కట్‌లతో కొట్టడం సాధ్యం కాదు” అని కిషోర్ అన్నారు.
కొసమెరుపు ఏంటంటే… అసలు ఈ దేశానికి దరిద్రం పట్టిందే ప్రశాంత్ కిషోర్ వల్లే… ఆ రోజు కాంగ్రెస్ ను చంపింది ప్రశాంత్ కిషోరే. మళ్లీ ఇపుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారాలు చేసి 2014లో కాంగ్రెస్ ను ఓడించిన ప్రశాంత్ కిషోర్, 2019లో చంద్రబాబు ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేసి చంద్రబాబును ఓడించారు. ఇపుడు తీరిగ్గా బాధపడితే ఉపయోగం ఏమీ లేదు.