అద్భుతమైన అవకాశం… పవన్ చేజార్చుకున్నారా?.. రాష్ట్రంలో ఆల్టర్నేట్ లేని పరిస్థితి! మరి దీనిని ఎవరైనా ఎలా వినియోగించు కుంటారు?అంటే..ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత చక్కని అవకాశం రావడమే ఎక్కువ అని గంతులేస్తారు. అనుకున్న విధంగా ముందుకు సాగుతారు. నిజానికి తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే.. అక్కడ చాలా పార్టీలు ఉన్నాయి. అంతేకాదు.. తెలంగాణ సెంటిమెంటు, బలమైన కేసీఆర్ వంటి నాయకుడుని నెగ్గుకుని.. పార్టీని నిలబెట్టుకోవడం.. అధికారంలోకి రావడం వంటివి చాలా కష్టం.
కానీ, ఏపీ పరిస్థితి అలా లేదు. ఇక్కడి ప్రజలు ఒక మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకా దు.. ప్రస్తుతంఏపీలో బలమైన పార్టీలుగా రెండే ఉన్నాయి. ఒకటి అధికార పార్టీ రెండు టీడీపీ. ఈ రెండు పార్టీలను పక్కన పెడితే.. చిన్నాచితకా పార్టీలు. పట్టుమని పది మంది నాయకులు కూడా లేని పార్టీలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు తమకు అండగా ఉండే నాయకుడి కోసం.. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించే నాయకుడి కోసం .. ప్రయత్నిస్తున్నారు.
దీనిని చక్కగా వినియోగించుకునే అవకాశం జనసేన అధినేత పవన్‌కు ఉంది. గతంలో ఆయన ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపైనా.. ప్యాకేజీ తెచ్చుకున్న చంద్రబాబుపైనా.. విమర్శలు గుప్పించినప్పుడు రాష్ట్ర ప్రజలు అంతా ఆయన వెంట నిలిచారు. పవన్ కోసం..ఏమైనా చేస్తామని.. అన్న యువత.. రాష్ట్రం కోసం… పవన్ వెంట నడుస్తామని ప్రకటించింది. కానీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇక, ఇప్పుడు ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే.. వైసీపీ , లేకుంటే టీడీపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
కానీ, మెజారిటీ ప్రజలు ఈ రెండు కాకుండా.. ఇంకేదైనా ఉందా? అని చూస్తే.. సూత్రం లేని గాలిపటంగా ఊగిసలాడుతున్న జనసేన కనిపిస్తోంది. ఏమాత్రం దన్నుతో ఈ పార్టీనిలబడినా.. ప్రజలే దానికి ఆక్సిజన్ అందించేందుకు రెడీగా ఉన్నారు. కానీ, ఈ చిన్న విషయాన్ని కూడా పవన్ పక్కన పెడుతున్నారు. ఎన్నికల సమయానికి వచ్చి నాలుగు డైలాగులు చెప్పి.. ఓట్లు దండుకుందామనే వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. కానీ, ఇది ఇప్పటి తరం ప్రజలకు సరికాదు. ఏదైనా బలమైన కార్యక్రమాల ద్వారా తమకు భరోసా కల్పించాలని వారు కోరుంటున్నారు. ఏదేమైనా.. ఇంత చక్కని ఛాన్స్ దక్కినందుకు జనసేనను అభినందించాలో.. లేక మిస్ చేసుకుంటున్నందుకు బాధపడాలో అర్ధం కాని పరిస్థితి.