రెండున్నర గంటల పాటు సాగిన భేటీ అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడిన విషయం అందరూ విన్నదే.
ఇటీవల కుప్పం టూర్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా బాబుకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు.
ఈ సమయంలో పవన్ పేల్చిన మాటలు వైసీపీని ఎండగట్టాయి. కందుకూరు, గుంటూరులో జరిగిన దుర్ఘటనలను ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
“లా అండ్ ఆర్డర్ పోలీసుల విధి. అది విఫలమైతే ప్రభుత్వం విఫలం అయినట్టే’’ అని వ్యాఖ్యానించారు.
’’ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేసి ప్రజల్లోకి వెళ్లకుండా ఆపేందుకు తీసుకొచ్చిన చీకటి జి.ఓ. నెం.1కి వ్యతిరేకంగా పోరాడుతాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా ఎలా పోరాడాలో చర్చించాం. ఏపీలో ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.
శ్రీకాకుళంలో @PawanKalyan గారి సభకి ఎందుకు అనుమతి ఇవ్వరు ? – @ncbn . pic.twitter.com/1GJ5nNYm18
— iTDP Official (@iTDP_Official) January 8, 2023