స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇన్‌స్టాగ్రామ్‌లో తన చిత్రాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పటికపుడు తను బోర్ కొట్టకుండా సమంత పడే కష్టం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.
సమంత తాజా సినిమా “శాకుంతలం” ట్రైలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె ఇన్ స్టా ఫొటో చూసిన వారు ఏంట్రా ఇది ఇంత కొత్తగా … కనిపిస్తోంది అంటున్నారు. ఆ అందమైన పోజును చూసి మైమరిచిపోతున్నారు.
ఆకర్షణీయంగా ఉండటం…. ఆకర్షణీయంగా కనిపించడం… రెండూ ఒకటి కాదు… ఆ రెండూ సమంతలో కనిపిస్తాయి.
దుష్యంత రాజుతో ప్రేమ కథ ఇతిహాసంగా మారిన శకుంతల పాత్ర కోసం దయ మరియు భంగిమను కొనసాగించడం చాలా కష్టమైన విషయమని సమంత వెల్లడించింది.
“నడుస్తున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, ఏడుస్తున్నప్పుడు కూడా, మనం దయను కొనసాగించాలి, ఇది అంత సులువుగా అబ్బలేదు. నేను ప్రత్యేక క్లాసులు తీసుకున్నాను, ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అరుణ బిక్షు తనకు ఆ రకమన శిక్షణ ఇచ్చిందని సమంత చెప్పింది.
ఎల్లోరా శిల్పంలా సమంత తాజా ఫోజు కిక్కిస్తోంది. టైట్ ప్యాంట్‌లో ఫుల్ స్లీవ్ హై బ్రీస్ట్ టాప్ తో సమంత పోజు అభిమానులకు వరంలా కనిపిస్తోంది. ఆ హాట్ ఫిజిక్ ని ఎలా వర్ణించినా తక్కువే.
A smile is the prettiest thing you can wear.. Yenni rojulu ayyindhi ila choosi @Samanthaprabhu2 🥺❤️#SamanthaRuthPrabhu pic.twitter.com/mnyszA647A
— Tirumala Ganesh (@Tirumala_sam) January 7, 2023