ఎన్ఆర్ఐ టిడిపి సెల్ లో శిక్షణ పొందిన 10 మందికి USA కి చెందిన కంపెనీలో ఉద్యోగాలు, నియామక పత్రాలు అందజేసిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు విజనరీతో, వేమూరి రవి ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్ఆర్ఐ టిడీపి సెల్ లో ఇస్తున్న శిక్షణ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు వివిధ రంగాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
అమెరికాలో స్థిరపడిన తెలుగువారిని వారు స్థాపించిన కంపెనీల బ్రాంచ్ లను ఆంధ్రప్రదేశ్ లో స్థాపించే విధంగా ఎన్ఆర్ఐ టిడిపి సెల్ విశేష కృషి చేస్తుంది.
ఇందులో భాగంగా అమెరికాలోని బోస్టన్ నగరంలో నివసిస్తున్న ప్రముఖ ఎన్ఆర్ఐ తేలప్రోలు సూర్య ఇటీవలే తమ సంస్థ బ్రాంచ్ ని మంగళగిరిలో ప్రారంభించారు.
గత 15 రోజుల క్రితం వారు ఇక్కడ శిక్షణ పొందిన ఐదుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
ఈరోజు మరో 10 మంది ఇక్కడ శిక్షణ పొందిన వారిని నియమించుకున్నారు.
ఈ సందర్భంగా వారి నియామక పత్రాలను ప్రియతమ నాయకుడు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ ఆధ్వర్యంలో పార్టీ సెంట్రల్ ఆఫీసులో జరిగింది.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, శానిటీ స్టాపింగ్ కంపెనీ రీజనల్ మేనేజర్ సిరిగిరి సుబ్బుతో పాటు పది మంది అభ్యర్థులు పాల్గొన్నారు.
ఎన్ఆర్ఐ టిడిపి పిలుపు మేరకు ఇక్కడ తమ కంపెనీ బ్రాంచ్ ను స్థాపించి పలువురికి ఉద్యోగాలు అందిస్తున్న తేలప్రోలు సూర్య ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.