నారా లోకేష్. దార్శనికతకు, దూర దృష్టికి మారుపేరైన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వారసు డు. అయితే.. ఆయన కేవలం ఆస్తులకో.. వ్యాపారాలకో.. రాజకీయాలకో.. పార్టీకో మాత్రమే వారసుడు కాదు. చంద్రబాబు దూర దృష్టికి, స్థితప్రజ్ఞతకు కూడా నారా లోకేష్ వారసుడు! 20 ఏళ్ల భవితవ్యాన్ని చంద్రబా బు ఎలా అయితే స్వప్నిస్తారో.. నారా లోకేష్ కూడా అలానే తపిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు, ఉద్యోగ కల్పన రంగాలను పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత ఏడాది జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. ఏపీలోని అనంతపురం నుంచి అరకు వరకు ఆయన ఆమూలాగ్రం పర్యటించారు. పాదయాత్ర ద్వారా లక్షల మంది ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, విద్యావంతులు, మేధావులు కూడా నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచారు. తన పాదయాత్రలో చూసిన అనేక విషయాలపై నారా లోకేష్ నోట్స్ కూడా రాసుకున్నారని పార్టీ నాయకులే తరచుగా చెబుతుంటారు.
ఈ క్రమంలోనే ఉన్నత విద్యను అభ్యసించి కూడా.. స్థానిక ప్రాంతంలో ఉపాధికల్పన పొందలేక పోతు న్నామని లక్షల మంది నిరుద్యోగులు ఆయనకు విన్నవించారు. ఈ క్రమంలోనే ఆయన అధికారంలోకి వస్తూ వస్తూనే.. ఉపాధి కల్పన ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. మెజారిటీ యువతకు సొంత ప్రాంతంలోనే ఉపాధికల్పించేలా.. ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట.. టాటా కు చెందిన టీసీఎస్‌ను విశాఖకు రప్పించే ప్రక్రియను వేగవంతం చేశారు.
దీనివల్ల ఏపీలో 10 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక, ఇప్పుడు మరింత దూర దృష్టితో నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. చూస్తూ కూర్చుంటే కాలం కరిగిపోతుందని భావించిన ఆయన ఇతర దేశాలకు వెళ్లి మరీ పెట్టుబడి దారులను ఏపీకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా.. ఆ నెల 25 నుంచి నారా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రముఖ వ్యాపార వేత్తలను ఆయన ఏపీకి ఆహ్వానించనున్నారు. అదేవిధంగా అక్కడ జరిగే `ఐటీ సెర్వ్ సినర్జీ`(ఐటీ సేవల ఏకీకృతం) సదస్సులోనూ నారా లోకేష్ పాల్గొననున్నారు. తద్వారా ఏపీకి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని లోకేష్ భావిస్తున్నారు.