గత ప్రభుత్వంలో సీఎం జగన్ ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. పరదాల ముఖ్యమంత్రిగా పేరుపడ్డ జగన్….జనం మధ్యలో తిరిగి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. అయితే, అందుకు భిన్నంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వచ్చిన సీఎం చంద్రబాబు….ప్రజలతో దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…బాధితుల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారమేతమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఆ సమస్యలకు కారణమైన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని బాధితులనకు హామీ ఇచ్చానని చంద్రబాబు అన్నారు. పలు చోట్ల భూ రికార్డులు తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలోనూ భూకుంభకోణం జరిగిందని ఆరోపించారు.
చంద్రబాబు వస్తున్న విషయం తెలుసుకున్న ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. తమ సమస్యలు, వినతులు ఇచ్చారు. ప్రతిఒక్కరి దగ్గరకు వెళ్లిన చంద్రబాబు వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం వేధింపులకు గురైన బాధితులు కూడా చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ జనసంద్రంగా మారింది. ఆల్రెడీ లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు కూడా విశేష ఆదరణ వస్తున్న సంగతి తెలిసిందే.