ఆంధ్రప్రదేశ్ పోలీసులు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ల నిర్వాహకులతో దాగుడు మూతలు ఆడి చివరకు వాల్తేరు వీరయ్యకు అనుమతులు ఇచ్చారు. చివరకు బాలయ్య సినిమాకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆ తర్వాత ‘వీరసింహా రెడ్డి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ఎందుకో అనుమతి ఇచ్చారు.
ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టాలీవుడ్‌కు అడ్డంకులు సృష్టిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అనేక గందరగోళాలు జరిగిన నేపథ్యంలో కమ్మ సామాజికవర్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ టార్గెట్ చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నేత రామకృష్ణ ఆరోపించారు.
“పోలీసులది ప్రతీకార చర్యగా కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక జగన్ ప్రభుత్వం ఉందని నేను అనుమానిస్తున్నాను. సినిమా పరిశ్రమ ప్రజలను వినోదం పంచుతుంది. ఎంతో మందికి ఉపాధి ఇస్తుంది” అని ఆర్కే అన్నారు. జగన్ కమ్మ సామాజిక వర్గంపై పగబట్టారు. స్వాతంత్ర్యం తర్వాత కమ్మ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేని మొట్టమొదటి మంత్రివర్గం ఇదేనని ఆయన అన్నారు. ఇది జగన్ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం అన్నారాయన.
జగన్ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని వామపక్ష పార్టీ అధినేత ఆర్కే హెచ్చరించారు. “సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి, మెజారిటీ మంత్రులు రెడ్డి వర్గానికి చెందినవారు, డిజిపి రెడ్డి మరియు హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా అదే సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పదవులు, కీలక పదవులు అన్ని రెడ్లకు ఇచ్చే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అంటూ సీఎం జగన్ మాట్లాడటం సిగ్గుచేటు’’ అని రామకృష్ణ మండిపడ్డారు.