ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెగాసస్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో పెగాసస్‌ను కొనుగోలు చేశారనే ఆరోపణలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా బాబును టార్గెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ పెగాసస్ కొనుగోలు వ్యవహారంపై విచారణ కోసం అసెంబ్లీ సభా సంఘాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తుందని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మొదట ట్యాపింగ్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆ తర్వాత మాత్రం నాలిక్కరుచుకుని తన వ్యాఖ్యలను వక్రీకరించాని పేర్కొనడం గమనార్హం. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పరికరాల్ని వాడుతోందా? అంటే వాడుతుందనే చెబుతామని ఆయన ఉదయం పూట వెల్లడించారు.
దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఈ పరికరాల్ని, ఇతర సాఫ్ట్వేర్లను దేశ భద్రత దృష్ట్యా ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వమూ వీటిని రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగిస్తుందని స్పష్టం చేశారు. అంతే తప్ప.. చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆయన భార్యతో ఏం మాట్లాడుతున్నారు? ఆయన కుమారుడు, కోడలు ఏం మాట్లాడుతున్నారని తెలుసుకోవడం కోసం కాదని పేర్కొన్నారు.
పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అయితే ఉదయం సచివాలయ ప్రాంగణంలో ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన.. సాయంత్రం వాటిని ఖండించడం గమనార్హం. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని ఎప్పుడూ చేయదని తెలిపారు.
ప్రతి వ్యవస్థకూ సాఫ్ట్వేర్ ఉంటుందని సాఫ్ట్వేర్, స్పైవేర్ రెండూ వేర్వేరని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉదయం పూట ఆయన ఫోన్ల ట్యాపింగ్‌పై చేసిన వ్యాఖ్యలు అధిష్ఠానానికి ఆగ్రహాన్ని తెప్పించాయని సమాచారం. దీంతో పార్టీ ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని గ్రహించిన అధిష్ఠానం వెంటనే మాట మార్చాలని అమర్నాథ్ ఆదేశాలు జారీ చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.