బీజేపీ ఆర్థిక విధానాలు ప్రభుత్వ ఖజానా నింపుతున్నాయి కానీ జనాల జేబులను ఖాళీ చేస్తున్నాయి.
ప్రజలకు ఎన్ని రకాల పన్నులు వేయాలో, వారిని ఎలా పిండాలో మోడీ సర్కారుకు బాగా తెలుసు.
అందుకే కరోనా సమయంలో వేల కోట్లు ఇచ్చినట్లే ఇచ్చాడు గాని.. అవి ఎక్కడికి పోయాయి, ఎలా పోయాయో తెలియదు.
ఇక జీఎస్టీ పేరుతో సర్కారు ఓ రేంజ్ లో పిండేస్తోంది జనాల్ని. తాజాగా సెప్టెంబరు లెక్కలు బయటకు వచ్చాయి.
సెప్టెంబరు మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వరుసగా మూడో నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటడం విశేషం.
స్టాక్ మార్కెట్ కి అనుకూలమా?
వరుసగా మూడు నెలలు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి అంటే దాని అర్థం వ్యాపారాలు బాగా మెరుగుపడ్డాయని. వ్యాపారాలు మెరుగుపడటం అంటే స్టాక్ మార్కెట్లోని కంపెనీలకు పాజిటివ్వే కదా.
జులైలో రూ.1.16 లక్షల కోట్లు, ఆగస్టులో రూ.1.12 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా… సెప్టెంబరులో జీఎస్టీ రూపేణా రూ.1,17,010 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది. గత మూడు నెలల్లో సెప్టెంబరులోనే వసూళ్లు ఎక్కువున్నాయని అర్థమవుతోంది.
గతేడాది ఇదే నెలలో రూ.95,480 కోట్ల జీఎస్టీ వసూలైంది. 2020తో పోల్చితే ఈసారి సెప్టెంబరు మాసంలో 23 శాతం వృద్ధి కనిపించడం విశేషం.