చంద్రబాబును పనికిమాలిన తిట్లు అన్నీ తిడుతూ కొడాలి నాని టీడీపీ కేడర్ లో పౌరుషాన్ని నింపారు. వైసీపీ నేతలు ఎలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా సరైన దమ్మున్న కౌంటర్ వైసీపీకి పడలేదు. అది ఎలా ఉంటుందో ఈరోజు తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న రుచిచూపించారు వైసీపీ నేతలకు, కొడాలి నానికి.
చంద్రబాబు జీవితంలో చేసిన పొరపాటు ఏదైనా ఉందంటే అది కొడాలి నాని వంటి వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడమే అని చెప్పిన బుద్ధా వెంకన్న నువ్వు కనుక కెమెరా తీసుకుని చంద్రబాబు ఇంటిని టచ్ చేస్తే నిన్ను అక్కడి నుంచి శవంగానే ఇంటికి పంపిస్తాను అంటూ మోస్ట్ పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చాడు బుద్ధా వెంకన్న.
నువ్వు టైం చెప్పి చంద్రబాబు ఇంటికి రా. నీ కథేంటో చూసుకుంటాం అని ఇంతవరకు ఎవరూ ఇవ్వనటువంటి ఘాటుగా సమాదానం చెప్పాడు. వైసీపీ నేతలు ఎవరైనా చంద్రబాబు తిట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎవడినీ వదిలేదు లేదు అంటూ బద్ధా గట్టి వార్నింగే ఇచ్చారు.
నా మాటల ఆధారంగా ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి… చంపుతారా? చంపుకోండి. లోపలేస్తారా… వేస్కోండి… కానీ నేను బతికుంటే మాత్రం వైసీపీ నేతలను బతకనివ్వను అని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న.
https://www.youtube.com/watch?v=3EANKjPko_U&ab_channel=ABNTelugu