ప్రేమ అనే ఐశ్వర్యం ఓ పేద ఇంట ఉండి ఉంది.
ప్రేమ అనే ఐశ్వర్యం ఓ ఐశ్వర్యవంతుడు ఇంట, సకల విలాసాలూ తులతూగేచోట లేదు.
ప్రేమ అనే ఐశ్వర్యానికి దూరం అయిన చోటున బాధ ఉంది. దుఃఖం ఉంది.
పిల్లలు, భార్య ఇంకా కొందరు ఉంటేనే బాగుంటుంది అన్న బాధ దగ్గర బిల్ గేట్స్ ఇప్పుడొక ఒంటరి !
డబ్బులున్న ప్రతిచోటా అనంతం అయినవేవో దొరకవు.
డబ్బులున్నా లేకపోయినా అనంతం అయినవే దొరుకుతాయి. వాటిని గుర్తించడం బాధ్యత. నెత్తిన పెట్టుకుని ఊరేగడం కొన్ని సార్లు కర్తవ్యం కూడా ! పిల్లలు వెళ్లిపోయాక (రెక్కలు వచ్చినా రాకున్నా) ఆ ఇంటి మొండి గోడల మయం అయింది.
భార్య మెలిందా వెళ్లాక ఆ ఇల్లు ఒంటరిది అయింది.
ఆయన నిర్మించుకున్న సౌధపు గోడలు రంగులు ఇంకా కొన్ని బిల్ గేట్స్ వైపు.. కానీ లోకం మాత్రం ఎటుటవంటి ఆకర్షణీయ చూపు లేకుండానే ఉంటుంది.
కొన్ని మాత్రం భయాందోళనలను విసిరి వెళ్తాయి.
అంతరంగ కల్లోలాలు బిలియనీర్ గేట్స్ ఉన్నాడు.
భార్య లేని బాధతో పాటు పిల్లలు తన దగ్గర లేరన్న చేదు నిజంలో కూడా ఉన్నాడు.
చేదు నిజం దాటి వెళ్లలేని స్థితి కూడా ఉన్నాడు. ఆ విధంగా దేవుడ్ని వేడుకుంటున్నాడు.
అయిన వాళ్లు లేకుండా తానొంటరి ! మళ్లీ భార్య కరుణిస్తే విడాకుల మాట దేవుడెరుగు మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు.
ఆ విధం అయిన దేవుడి కరుణ కోసమో (ఏమో ఆయనకు ఆ నమ్మకాలు ఉన్నాయో లేవో తెలియదు) లేదా మాజీ ప్రేయసి ప్రేమ కోసమో పరితపిస్తూ ఉన్నాడు.
మళ్లీ మెలిందాను పెళ్లి చేసుకుంటాను అని కూడా అంటున్నాడు.
గత ఆగస్టులో విడాకులు తీసుకున్న ఈ జంట ఆ తరువాత ఎవరి లోకంలో వారున్నారు. కానీ బిల్ గేట్స్ మాత్రం ఆమె లేని లోకాన్నే ఊహించలేకపోతున్నాడు.
ప్రేమ లేదని..ప్రేమించ రాదని..సాక్షమే నీవనీ..నన్ను నేడు చాటనీ..ఓ ప్రియా జోహారులు అని పాడుకోవడంలో కూడా ఆనందం ఉంది.
ఆ ఆనందాలను రెట్టింపు చేయడం కూడా కొన్ని సార్లు ఎవరికి వారు తీసుకోవాల్సిన బాధ్యత. విషాదం ఉంది.
విషాద పూర్వ స్థితి ఏమయినా ఉంటే దానిని కూడా గుర్తించి వెళ్లాలి. ప్రపంచంలో ప్రేమకు కోటీశ్వరుడి అంటే మమకారం లేదు.
పేదవాడు అంటే హీన భావం లేదు. రాజుకు, బీదకు ప్రేమ ఒక్కటే.. ! అవునా! మరి! డబ్బుంటే ప్రేమ కొనచ్చా సాధ్యం కాని పని !
డబ్బుంటే ఎన్నో పనులు చేయొచ్చు కానీ ప్రేమను కొనలేం. ప్రేమను వెలకట్టలేం. నోట్ల కట్టల నడుమ నిరంతర సావాసం చేసే కోటీశ్వరులకు అప్పుడప్పుడూ జరిగే జ్ఞానోదయాలను సైతం గురించడం మన బాధ్యత. లేదంటే మనం కూడా ఆ గుడ్డితనం లో లోకాన్ని చూడం.
మన అనే లోకాన్నే చూడం. తన., మన అన్న భేదం భావం వద్దనుకుని వ్యవహరించం.
ఇవన్నీ ప్రేమ లేని కారణంగా వస్తాయి. లేదా అన్నీ ఉన్నాయన్న అహం నుంచి కూడా వచ్చి మన నుంచి విలువయిన వేవో తీసుకువెళ్తాయి. అదే ఇప్పుడు బిల్ గేట్స్ జీవితాన జరిగింది.