దోపిడీ కి అడ్డుకట్ట వేస్తాను, ప్రజా ధనాన్ని కాపాడుతాను.. అని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇటీవల శాసన సభలోనూ సీఎం చంద్రబాబు ఇదే మాట చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, అస లు విషయానికి వస్తే.. అధికార పార్టీ నాయకులే పక్కా లెక్కలతో దోచేస్తున్నారన్నది టీడీపీలోనే జరుగుతు న్న చర్చ. ఈ విషయం సీఎంవో దాకా కూడా వెళ్లింది. తమ్ముళ్లు-తమ్ముళ్లు ఊళ్లు పంచుకున్నారన్న వాద న కూడా బలంగా వినిపిస్తోంది.
ఉదాహరణకు సీమలో నియోజకవర్గాల వారీగా నాయకులు వనరులు పంచేసుకున్నారట. ఇసుక, మద్యం లో భారీ ఎత్తున సొమ్ములు చేసుకుంటున్నారు. గతంలోనూ ఇలానే వ్యవహరించారు. అయితే.. చంద్రబా బు సీరియస్ కావడంతో కొన్ని రోజులు సైలెంట్ అయినప్పటికీ.. తర్వాత.. యథారాజా అన్నట్టుగా తయార య్యారు. పైకి అందరూ మౌనంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ, అంతర్గతంగా మాత్రం ఎవరి వ్యాపారాలు, వ్యవహారాలు వారివి. ఈ విషయంలో అందరూ అందరే!
ఇటీవల సీఎం చంద్రబాబు వద్దకు సీమకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వచ్చారు. పక్క నియోజకవర్గం లో ఇలా జరుగుతోందని, పార్టీ పరువుకు భంగం ఏర్పడుతోందని మరో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు స్వయంగా ఈ ఎమ్మెల్యే విషయాలను ఆయన ముందు పెట్టారు. మీ సంగతేంటి? ముందు మీరు మారండి! అని హితవు పలికారు. దీంతో సదరు ఎమ్మెల్యే మౌనంగా వెళ్లిపోయారు. ఈ పరిస్థితి ఈ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా 70-90 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉంది. అంతేకాదు.,. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే.. పారిశ్రామిక వేత్తలకు ఫోన్లు చేస్తున్నారు. చందాలు వసూలు చేస్తున్నారు. వీటిలో సగం ఖర్చు చేసి.. మిగిలిన సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారు. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. లెక్క లు పెట్టుకుని మరీ దోచుకుంటున్నారని వాస్తవం. అయితే.. ఈ విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. నాయకులు రోడ్డెక్కే పరిస్థితి ఉండడంతో చంద్రబాబు కూడా కేవలం బెదిరింపులకే పరిమితం అయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.