దేశం ఏదైనా కానీ పార్లమెంటు భవనం అన్నంతనే భక్తిప్రపత్తులతో జాగ్రత్తగా ఉండటం కనిపిస్తుంది. దేశంలోని ప్రజాస్వామ్యానికి నిలువెత్తు రూపంగా ఉండే ఆ భవనంలో వెధవ వేషాలు వేసే సాహసం ఎవరూ చేయరు. అందుకు భిన్నంగా ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలో సాగే ఆరాచకాలకు సంబంధించిన వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. దీంతో.. ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది.
ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలో పని చేసే కొందరు ఉద్యోగులతో పాటు.. రాజకీయ నేతలు నిసిగ్గుగా తమ సెక్సు కోరికల్ని తీర్చుకోవటానికి వేదికగా వాడేసుకోవటం సంచలనంగా మారింది. ఒక మహిళా ఎంపీ పేషీలో పని చేసే ఉద్యోగి ఒకరు.. కుర్చీలో కూర్చొని.. ప్యాంట్ జిప్పు విప్పుకొని ఛండాలం చేసుకోవటమే కాదు.. దాన్ని వీడియో తీసి తన స్నేహితులకు పంపాడు.
మిగిలిన వారు సైతం.. వారు చేసే విచ్చలవిడి రొమాన్సుకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు షేర్ చేశారు. మరింత జరుగుతున్నప్పుడు.. నేతలు.. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటే.. వారైతే పార్లమెంటుప్రేయర్ హాల్లోనే దుకాణం పెట్టేశారట. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు లీక్ అయి.. ఇప్పుడు సంచలనంగా మరాింది.
2019లో తనపై తోటి ఉద్యోగి పార్లమెంటుభవనంలోఅత్యాచారానికి పాల్పడినట్లుగా ఒక మహిళ ఫిర్యాదు చేయటంతో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోఅసలు పార్లమెంటులో ఏం జరుగుతోందా తెలుసా? అంటూ ఓ గుర్తు తెలియని ఉద్యోగి.. తన దగ్గరున్న వీడియోలు.. ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. తాను పోస్టు చేసినవి రెండేళ్ల క్రితం నాటివని చెప్పిన అతను.. పార్లమెంటు భవనాన్ని ఎంత దారుణంగా మార్చేశారో ప్రపంచానికి తెలిసేలా చేశారు. దీంతో.. ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బయటకు వచ్చిన వీడియోలు.. ఫోటోల ఆధారంగా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టే పని మొదలు పెట్టింది. పార్లమెంటు భవనాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.