ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే మొత్తం చెప్పడంపై సాక్షా త్తూ.. మంత్రులే తడబడ్డారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఒక లెక్క, మంత్రి ధర్మాన ప్రసాద రావు మరో లెక్క చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన వైసీపీ సామాజిక న్యాయభేరి సభలో జరిగిందీ వింత..! ఇక.. ఇక్కడ కూడా సభ ప్రారంభానికి ముందే సగం జనం వెళ్లిపోగా మంత్రులు ప్రసంగిస్తుండగా ప్రాంగ ణంలో 25 శాతం మంది మాత్రమే మిగిలారు. వారు కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపిన దాఖలా కనిపించలే దు.
“ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ కూడా అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా. ఇంకెన్ని చేయాలి” అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. “సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర” నంద్యాలలో ప్రారంభమై కర్నూలు, గుత్తి, పామిడి మీదుగా అనంతపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన వివిధ సభల్లో పలువురు మంత్రులు మాట్లాడారు.
మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో బడుగుల అభ్యున్నతికి గొప్ప పనులు జరిగాయి. అయినా అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదని వ్యాఖ్యానించవద్దు. ఎందుకు జరుగుతాయి ? మన అవసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉంటే.. అన్ని అవసరాలు తీర్చడానికి మరికొంత సమయం పడుతుంది. గడిచిన 75 సంవత్సరాల్లో వీటిని తీర్చి ఉంటే అవి ఇప్పుడు ఉండేవి కావు కదా ? మా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యమిస్తోంది. అందుకే కొన్ని పనులు ఆలస్యమవుతాయి. “ అని వ్యాఖ్యానించారు.
గతంలో జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే అసలు ప్రజా ఉద్యమాలు వచ్చేవే కాదన్నారు. ఈ క్రమంలో సంక్షేమ కార్యక్రమాలకు లక్షా 48 వేలకోట్లు వ్యయం చేస్తున్నామంటూ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పుకొస్తే.. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ధర్మాన ప్రసాదరా వు సెలవిచ్చారు.
మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్ ప్రసంగిస్తూ.. మహానాడులో ఓ నాయకురాలు తొడకొట్టారని, జనాలు త్వరలోనే ఓటు ద్వారా కొట్టి చంద్రబాబుకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. “జగన్‌ది రామరాజ్యమని.. చంద్రబాబుది రాక్షస పాలన”అని పేర్కొన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బడుగులకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు.
Nadu vimarshalu, nedu pogadthalu !
| Dharmana Prasad Rao |
Nadu :- avineethi parudu
Nedu :- Jagan anni telsinodu, alanti nayakudu ekkada ledu pic.twitter.com/d9IrTdmTFU
— Guido Fawkes (@itsGuidoFawkes) May 28, 2022