తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు, యువ నటుడు ధ్రువ్ విక్రమ్ తో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరి ప్రైవేట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ పిక్‌లో ధ్రువ్ విక్రమ్ కు అనుపమ లిప్‌లాక్ ఇస్తూ కనిపించింది. దీంతో ధ్రువ్, అనుపమ లవ్‌లో ఉన్నారని.. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ధ్రువ్, అనుపమ జంటగా ప్రస్తుతం `బైసన్` అనే మూవీ చేస్తున్నారు. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ సినిమాలో ధ్రువ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడు. అతని ప్రేయసి పాత్రను అనుపమ పరమేశ్వరన్ పోషిస్తోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ బ్యానర్లపై సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా. రంజిత్ మరియు అదితి ఆనంద్ సంయుక్తంగా బైసన్ సినిమాను నిర్మించారు.
ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్న ధ్రువ్, అనుపమల లిప్‌లాక్ పిక్ `బైసన్` చిత్రంలోది అయ్యుండొచ్చని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే ధ్రువ్, అనుపమలు స్పందించాల్సిందే. కాగా, అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే అనుపమ మలయాళ బ్లాక్ బస్టర్ `ప్రేమమ్`తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. `అ ఆ`తో తెలుగువారికి దగ్గరై.. `శతమానం భవతి`తో భారీ స్టార్డమ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. టాలీవుడ్ లో చివరగా `టిల్లు స్క్వేర్`తో అనుపమ బిగ్ హిట్ ను అందుకుంది.
#DhruvVikram and #AnupamaParameswaran Dating?
pic.twitter.com/NE9OXyyMsh
— SillakiMovies (@sillakimovies) April 13, 2025