నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం ఎర్దండిలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. అర్వింద్‌పై దాడిని ఆయన ఖండించారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అర్వింద్ అమిత్
తన పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగినా తనపై దాడులు జరపాలని టీఆర్ ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ జరిగిన దాడి వెనక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని అమిత్‌షాకు తెలిపారు. మొత్తానికి అర్వింద్ చెప్పింది ఓపికగా విన్న షా.. ఏం చేయాలనే విషయంపై మాత్రం దిశానిర్దేశం చేయలేదు. త్వరలోనే తాను మరోసారి హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్టు అర్వింద్ సన్నిహి
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయనను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అర్వింద్ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు.
ఆ సమయంలో తమపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో తిరుగు పయనమైన అర్వింద్ ను మరోసారి వా
ఈ దాడిపై అర్వింద్ మాట్లాడుతూ.. ‘‘ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగింది, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చింది. దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఉన్నారు’’ అని ఎంపీ అర్వింద్ అమిత్ షాకు ఫోన్లో తెలిపారు. దీంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చాక పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.