ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా ఇంకా ఆయన చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. బెయిల్ పేపర్లు ఆన్ లైన్ లో అప్ లోడ్ కావడంలో జాప్యం, ఈ రోజే విడుదల చేయాలి అని స్పష్టంగా లేకపోవడం వంటి కారణాలతో ఆయన రేపు ఉదయం 6 గంటల తర్వాత విడుదల కాబోతున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులు అధికారికంగడా ధృవీకరించారు. జైల్లోని మంజీరా బ్లాక్ లో అల్లు అర్జున్ ను ఈ రోజు రాత్రి ఉంచనున్నారు.
ఈ రోజు పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లినప్పటి నుంచి కోర్టు రిమాండ్ విధించే వరకు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో చూద్దాం.
– మధ్యాహ్నం 12 PM
పుష్ప 2 రిలీజ్‌కు ముందు రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంథ్య థియేటర్లో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ కేసు విషయంలో చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం 12 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. పోలీసులు ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న వాళ్లకు సమాచారం లేకుండా బెడ్రూంలోకి వెళ్లిపోయారు. దీంతో కిందకు వచ్చి బన్నీ తన భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్పడంతో పాటు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బన్నీతో పాటు తండ్రి అల్లు అరవింద్ పోలీసు కారు ఎక్కినా బన్నీ ఈ కేసులో గుడ్ అయినా బ్యాడ్ అయినా తనదే బాధ్యత అంటూ తండ్రిని వారించి పోలీస్ స్టేషన్‌కు బయలు దేరాడు.
– మధ్యాహ్నం 1.30 PM
అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌తో పాటు తమ్ముడు అల్లు శిరీష్, నిర్మాత దిల్ రాజు మరి కొందరు ఇండస్ట్రీ పెద్దలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడన్న విషయం ఇండస్ట్రీలో ప్రముఖులకు అంతా పాకేసింది.
– మధ్యాహ్నం 2 PM
విశ్వంభర సినిమా షూటింగ్లో ఉన్న చిరంజీవికి ఈ విషయం తెలిసిన వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న వెంటనే తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆ వెంటనే నాగబాబు కూడా అక్కడకు వెళ్లారు. అయితే భద్రతా కారణాలతో పోలీసులు వీళ్లెవ్వరిని పోలీస్ స్టేషన్లోకి అనుమతించలేదు.
– మధ్యాహ్నం 2.02 PM
అల్లు అర్జున్ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
2.02 PM – అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు ప్రారంభం
2:50 PM – వైద్య పరీక్షలు పూర్తి.
2:55 PM – నాంపల్లికి కోర్టుకి బన్నీ తరలింపు.
3:15 PM – నాంపల్లికి కోర్టుకి అల్లు అర్జున్
3:40 PM – అల్లు అర్జున్ను A1గా తేల్చిన కోర్టు, 14 రోజుల రిమాండ్ విధింపు.
5:40 PM – అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు
11.40 PM – రాత్రంతా చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్ ఉంటారని అధికారుల ప్రకటన