రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన కేసు ఓటుకు నోటు. కేసీఆర్ ను తక్కువ అంచనా వేసిన ఫలితం ఇది.
ప్రతి పార్టీ ఓటర్లుకు డబ్బులు పంచడం చాలా కామన్. అయినా కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి విషయంలో కొన్ని సాక్ష్యాలు దొరికాయి.
నిన్న ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొదట్నుంచి FIR లో గాని, ఇక మరేదాన్లో గాని చంద్రబాబును పేరు చేర్చడానికి తగిన ఆధారాలు సంపాదించలేకపోయారు. దీంతో ఆ కేసులో చంద్రబాబుపై ఉన్న మరక తొలగిపోయింది.
తాజాగా ఈ వ్యవహారంపై ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఇప్పటికే అందులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి విచారణకు సహకరించడం, జైలులో గడపడం కూడా జరిగిపోయింది కాబట్టి ఇకపై మొత్తం విచారణ పూర్తయ్యే వరకు ఈ కేసులో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించరాదని పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ ఎదుర్కొంటున్న ఎంపీ రేవంత్‌రెడ్డికి ఒకింత ఊరట లభించినట్టయింది.
ఈ మేరకు తాజాగా కేసును విచారించిన సుప్రీం కోర్టు తెలంగాణ ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో దీనికి సమాధానం చెప్పాలని న్యాయమూర్తులు జస్టిస్ వీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంతలతో కూడిన ధర్మాస నం ఉత్తర్వులు జారీ చేసింది.
2015, మే 15 నాటి ఈ కేసులో ఇది ఒక కీలక ఘట్టం.