ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇప్పటిదాకా వైసీపీని ఢీకొనేందుకు టీడీపీ-జనసేన కూటమి మాత్రమే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. షర్మిల రావడంతో జగన్ కు షర్మిల రూపంలో మరో ప్రత్యర్థి కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే అన్న జగన్ పై షర్మిల…షర్మిలపై జగన్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, అన్నాచెల్లెళ్ల విమర్శల వ్యవహారంలో వారి తల్లి వైఎస్ విజయమ్మ నలిగిపోతున్నారు. ఇటు, కొడుక్కి చెప్పలేక..అటు కూతురుకి చెప్పుకోలేక విజయమ్మ సతమతమవుతున్నారు. కరవమంటే కప్పకు కోపం..వదలమంటే పాముకు కోపం అన్నరీతిలో విజయమ్మ పరిస్థితి ఉందట. ఇదే విషయంపై మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.