జగన్, షర్మిలల మధ్య గ్యాప్ ఉందని చాలాకాలంగా టాక్ ఉన్న సంగతి తెలిసిదే. టాక్ కు తగ్గట్లుగానే ఆ ఇద్దరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా విడివిడిగానే హాజరవుతున్నారు. ఇక, రేపో మాపో ఏపీ కాంగ్రెస్ లో షర్మిల వేలు పెట్టి అన్నకు పోటీ కాబోతున్నారని మరో ప్రచారం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా వైఎస్ షర్మిల చేసిన పని జగన్ అండ్ కోకు ఘోర అవమానాన్ని మిగిల్చింది. జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు షర్మిల క్రిస్ట్ మస్ గిఫ్ట్ పంపండంతో జగన్ , వైసీపీ నేతలకు షాక్ తగిలింది.
ఇక, ఆ గిఫ్ట్ స్వీకరించిన లోకేష్…షర్మిలకు ధన్యవాదాలు కూడా తెలిపారు. నారా కుటుంబ సభ్యుల తరఫున షర్మిలకు లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అన్నయ్య జగన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ కూడా చేయని షర్మిల…లోకేష్ కు ఏకంగా క్రిస్మస్ గిఫ్ట్ పంపడం అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలకు పరాకాష్ట అని చెప్పవచ్చు. లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ వ్యవహారంపై జగన్, సజ్జల వైసీపీ నేతల స్పందన ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.