రాజకీయ నాయకులకు పదవే పవర్ లాంటిది. పదవి దక్కేంతవరకు రాజకీయ నాయకులు ప్రజల చుట్టూ తిరుగుతారు. ఒక్కసారి పదవి దక్కింది అంటే ప్రజలను వారి చుట్టూ తిప్పించుకుంటారు. కానీ మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. పదవి అనేది కేవలం ప్రజలకు సేవ చేయడం మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక సామాన్యుడిలా ఉంటున్నారు.
ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టాలను తక్షణమే తీరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారులను పరుగులు పెట్టిస్తూ.. తాను పరుగులు పెడుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి నిదర్శనంగా మరో ఉదాహరణ తెరపైకి వచ్చింది. తాజాగా కాకినాడ జిల్లా ఉప్పాడ లో పవన్ కళ్యాణ్ పర్యటించారు.
అయితే ఉప్పాడ గ్రామానికి తన కాన్వాయ్ లో పవన్ కళ్యాణ్ వెళ్తుండగా.. ఒక చిన్న పిల్లవాడు తమ ఇంటి గేటు ముందు జనసేన జెండా పట్టుకొని ఊపుతూ ఎంతో హుషారుగా కనిపించాడు. అంతే డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఆగిపోయింది. కారులో నుంచి పవన్ టక్కున దిగి ఆ పిల్లవాడిని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. అలాగే పిల్లాడికి హగ్ ఇచ్చి.. ఆల్ ది బెస్ట్ చెప్పి పవన్ వెళ్లిపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పవన్ కళ్యాణ్ తీరుకు ఫిదా అయిపోతున్నారు. ఒక స్టార్ హీరో.. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ ఒక చిన్న పిల్లాడి కోసం తన కాన్వాయ్ ను ఆపి మరీ అతడిని పలకరించడం మామూలు విషయం కాదు. ఇది అతని సంస్కారానికి మరియు సింప్లిసిటీకి నిదర్శనం.
That is #PawanKalyan ! No words to explain ! #DeputyCMPawanKalyan #PowerStar @PawanKalyan pic.twitter.com/Vn2LO50OD5
— సురేష్ కవిరాయని suresh kavirayani (@sureshkavirayan) July 3, 2024