అమెరికాలో తెలుగు విద్యార్థికి చిత్ర హింసలు పెట్టి.. దారుణంగా హింసించిన కేసులో వైసీపీ నేత సత్తార్ వెంకటేష్ రెడ్డిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు.. మానవ అక్రమరవాణా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీకి చెందిన విద్యార్థి(పేరు చెప్పలేదు) అమెరికాలో చదువుకునేందుకువెళ్లాడు. అయితే.. అతనికి సాయం చేస్తామని చెప్పిన సత్తార్ వెంకటేష్ రెడ్డి.. సదరు విద్యార్థికి సమీప బంధువు కూడా కావడంతో తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు విద్యార్థిని హింసించడం ప్రారంభించినట్టు మిస్సోరా పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
ఏపీకిచెందిన విద్యార్థి.. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకునేందుకు గతేడాది అమెరికా వచ్చాడు. ఈ ఏప్రిల్‌లో సదరు విద్యార్థిని నిందితుడు వెంకటేష్ రెడ్డి తన ఇంటికి తీసుకువెళ్లాడు. తనకు సాయం చేస్తామని నమ్మబలికాడు. దీంతో వెంకటేష్‌రెడ్డిని నమ్మిన విద్యార్థి.. ఆయన ఇంట్లోనే ఉన్నాడు. అయితే.. ఏమాత్రం సాయం చేయకపోగా.. బలవంతంగా ఇంటి పనులు చేయించడం మొదలుపెట్టాడు. ఉదయం 4.30కు మొదలుపెట్టి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేదని బాధితుడు తెలిపాడు. సత్తారు తన ఐటీ సంస్థతో పాటు తన మూడు ఇళ్లలో కూడా పనులు చేయించేవాడు.
అంతేకాదు.. విషయాన్ని బయటకు చెబుతాడనే భయంతో ఫోన్‌ను లాగేసుకున్నారు. ప్రపంచంతో సంబంధాలు కూడా లేకుండా చేసి.. గత ఏడు నెలలుగా బాధితుడిని ఒక బేస్మెంట్లో బంధించారు. అక్కడే కాంక్రీట్ ఫ్లోర్‌పైనే నిద్రించాల్సి వచ్చేదని బాధితుడు పోలీసులకు తెలిపారు. అక్కడ కనీసం బాత్రూమ్ సదుపాయం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోనిచ్చేవారని, సరిగా తిండి కూడా పెట్టలేదని బాధిత విద్యార్థి తెలిపాడు.
బంధించి కూడా తనపై సీసీకెమెరాల ద్వారా నిఘా పెట్టారన్నాడు. ఇచ్చిన పని సరిగా చేయకపోతే.. ముగ్గురు నిందితులు అతడిని తీవ్రంగా కొట్టేవారని తెలిపాడు. కొన్నిసార్లు దుస్తులు తీయించి, ఒళ్లంతా కుళ్లబొడిచేవారు. ఎలక్ట్రిక్ వైర్లు, పీవీసీపైపులతో దాడి చేసేవారు. అతడి ఒంటిపై గాయాలున్నాయని, పలు చోట్ల ఎముకలు చిట్లాయని, ఇదొక అమానవీయ ఘటన అని అధికారులు పేర్కొన్నారు.
నాటకీయ పరిణామాల మధ్య..
బాధితుడిని పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య గుర్తించారు. 911 హెల్ప్‌లైన్‌కి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా పోలీసులు సత్తారు ఇంటికి వెళ్లారు. అయితే వారిని లోపలికి రానివ్వలేదు. అదే సమయంలో బేస్మెంట్ నుంచి బాధిత విద్యార్థి పరిగెత్తుకొచ్చాడని, అప్పుడు అతడు ఒంటినిండా గాయాలతో, వణుకుతూ కనిపించాడని వెల్లడించారు. సత్తారుతో పాటు మిగతా ఇద్దరు నిందితులు నిఖిల్ వర్మ, శ్రావణ్ వర్మ తన స్టూడెంట్ వీసా కోసం సహకరిస్తున్నారని భావించానని, అయితే వారు తన పత్రాలను ధ్వంసం చేశారని ఆ విద్యార్థి ఆరోపించాడు. సత్తారు ధనవంతుడని, రాజకీయ నేతలతో సంబంధాలున్నట్లు చెప్పాడు.
ఆంధ్ర నుండి అమెరికా దాకా @ysrcparty వారివి అవే అకృత్యాలు, అదే హింస, అదే ఫ్యూడల్ మనస్తత్వం, అదే నిరంకుశత్వం, అదే అహంకారం. అధికారం ఉన్నంత వారిని ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతూ ఉంటారు.pic.twitter.com/bHs4PivQxU
— Anjan P (@pdsdnn) December 1, 2023
https://x.com/naralokesh/status/1730466558475137489?s=20