తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమానికి 6 గ్యారంటీలను ప్రకటించామని భట్టి అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన భట్టి..గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలిచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. కానీ, ప్రజా సంక్షేమం సాధించేందుకు అవి తమకు అడ్డుకాదని, ఎంత కష్టపడడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
6 గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరమని భట్టి మండిపడ్డారు. దళిత బంధు పథకానికి బడ్జెట్ లో రూ.17,700 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్
బడ్జెట్ 2,75,891కోట్లు.
6 గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.
పరిశ్రమల శాఖ 2543 కోట్లు.
ఐటి శాఖకు 774కోట్లు.
పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.
పురపాలక శాఖకు 11692 కోట్లు.
మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.
వ్యవసాయ శాఖ 19746 కోట్లు.
ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.
ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.
ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.
మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు.
విద్యా రంగానికి 21389 కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.
వైద్య రంగానికి 11500 కోట్లు.
విద్యుత్ – గృహ జ్యోతికి 2418 కోట్లు.
విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు.