సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బయటకు వస్తున్న వాంగ్మూలాలలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఇక, వివేకా హత్య కేసు నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ వివేకా కూతురు సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసులో జగన్ పాత్రపై సీబీఐ విచారణ చేయాలని టీడీపీ నేతలు, విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వివేకా మర్డర్ కేసును తప్పుదోవ పట్టిస్తోంది జగనేనని గోరంట్ల ఆరోపించారు. అంతేకాదు, వివేకా కేసులో సాక్షులను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్ ను అరెస్టు చేసి ఈ వ్యవహారంలో రహస్యాలను సీబీఐ బయటికి లాగాలని గోరంట్ల కోరారు. వివేకా హత్య వెనుక జగన్ సకుటుంబ సపరివార సమేత కుట్ర ఉందని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై గోరంట్ల విమర్శలు గుప్పించారు. వివేకా కేసు విషయంలో సునీతపై సజ్జల ఆరోపణలు నిరాధారమైనవని, టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తుందని సజ్జల అనడం హేయమైన చర్య అని మండిపడ్డారు. అడ్డగోలుగా మాట్లాడడం సజ్జలకు తగదని గోరంట్ల హితవు పలికారు.
“”వీడుతున్న మబ్బులు..వెలుగులోకి వాస్తవాలు..అసలు దోషులెవరు?…బాబాయ్ హత్య కేసును చంద్రబాబుపై నెట్టేందుకు తప్పుడు ప్రచారం చేసిన జగన్…సిగ్గు, శరం ఉంటే సీఎం పదవి నుంచి వెంటనే దిగిపోవాలి. అవినాశ్ రెడ్డి, గంగి రెడ్డిల పాత్ర ఉందని సీబీఐ చెబుతోంది. కానీ, సీబీఐ విచారణ తప్పంటున్నారు. కోడి కత్తి కేసు కూడా హై డ్రామా…సానుభూతి కోసం తప్పుడు ప్రచారం చేసి ఈ పెద్దమనిషి సీఎం అయ్యాడు..కోడికత్తి కేసు దోషి ఏమయ్యాడు..సమాధానం లేదు. ఆర్థిక ఉగ్రవాది, నరహంతకుల ముఠా నాయకుడు, ఫ్యాక్షన్ నాయకుడు అధికారంలో ఉండి…విచారణ, న్యాయవ్యవస్థలను పక్కదారి పట్టిస్తున్నారు.
ఆ రోజు గుండెపోటని చెప్పి…అంత్యక్రియలు…హడావి