సాక్షి వాళ్లు తప్పు రాశారు అధ్యక్షా అని జగన్ అసెంబ్లీలో చెప్పినా నమ్మకుండా అది కూడా ఓ పత్రికే కదా అని చదువుతున్నాం. ఆయన పత్రిక ఆయనకే నచ్చలేదంటే మనకెందుకు అని మనకు బుద్ధి లేక చదివాం అనిపిస్తుంది ఇపుడు.
ఎందుకంటే…
నిమ్మగడ్డకు ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆయన వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రాలేకపోయాను అని సమాధానం ఇచ్చారు. అయితే ఇంకో మాట కూడా చెప్పారు. ఎస్ఈసీ మీ పరిధిలోకి రాదు అని కూడా చెప్పారు. దీని గురించి మన సాచ్చి పత్రిక…
రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటే మాత్రం, రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన శాసనసభ కమిటీ పిలిచినప్పుడు రావాల్సిందే అంటూ పెద్ద వ్యాసమే రాసుకొచ్చింది. రాకుండా నిమ్మగడ్డ దాగుడుమూతలు ఆడుతున్నారట.
నీతి వాక్యం బాగుంది….
మరి కోర్టులు కూడా రాజ్యాంగబద్దమే కదా.. చట్టబద్ధమైన వ్యవస్థలే కదా.
మరి ఇంత నీతి తెలిసిన సాక్షి మన జగన్ ముఖ్యమంత్రి కాకముందే ఒక నిందితుడు, 16 నెలల జైలు జీవితం గడిపారు, ప్రస్తుతం బైయిల్ మీద బయట గడుపుతున్న ముద్దాయి అన్న విషయం తెలియదా?
ప్రతీ శుక్రవారం కోర్టు విచారణకు హజరు కమ్మని కోర్టు పిలుస్తున్నది నిజం కాదా?
ఎప్పుడూ ఏదోక సాకు చూపించి వాయిదాలకు హజరు కాకుండా జగన్ దాగుడు మూతలు ఆడటం లేదా?
మరి ఇది సాచ్చి పత్రికకు కనపడటం లేదా?
తన బాస్ చేస్తే కరెక్టు, వేరొకరు చేస్తే నేరమా? సాక్షి రాసిన ఈ ఆర్టికల్ జగన్ కి వర్తించదా?
నిమ్మగడ్డ విషయంలో వాడిన ప్రామాణికాలు, జగన్ రెడ్డి దగ్గరకు వచ్చే సరికి, మీ కంటికి కనిపించవా?
ఎందుకు కనిపిస్తాయి
కనిపించవు, అయినా మీ బాసే మా సాచ్చి ఒక తప్పుడు పత్రిక అని అసెంబ్లీ సాక్షిగా సర్టిఫై చేశారు
బుద్ధి లేక మేము ఇంకా చదువుతున్నాం.
సొంతవారిపై మమకారం… ఎదుటి వారిపై వికారం
ఇదేనా సాక్షి జర్నలిజం?