ఎలాంటి విచారణ లేకుండా, విచారణ దశలో మూసేసిన మరికొన్ని మొత్తం 45 కేసులను ప్రభుత్వం రీఓపెన్ చేయాల్సిన పరిస్దితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాదరెడ్డి, పేర్నినానితో పాటు కొందరు ఎంఎల్ఏలు నేతలపై 2019 మే నెల ముందు నమోదైన కేసులను ప్రభుత్వం ఏకపక్షంగా ఎత్తేసింది. వీటిల్లో కొన్నింటిపై విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం వాటిని ఉపసంహరించేసింది.
ప్రజాప్రతినిధుల్లో చాలామందిపై అధికారులను దుర్భాషలాడారని, జనాలను రెచ్చగొట్టారని, ధర్నాలు, రాస్తారోకోలో పాల్గొన్నారనే కేసులే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రభుత్వం ప్రతిపక్షాల నేతలపై కేసులు పెడుతుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ నేతలపైన కూడా పెడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కేసులు నమోదవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి కేసులను ఏకపక్షంగా ఉపసంహరించేయటం మామూలే. జగన్ కూడా 45 కేసులను ఎత్తేశారు. దీనిపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయిన విషయం తెలిసిందే.
హైకోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కేసులను కూడా ప్రభుత్వాలు ఎత్తేసేందుకు లేదని గట్టిగానే రమణ వార్నింగ్ ఇచ్చారు. దాంతో జగన్ ప్రభుత్వం ఎత్తేసిన కేసులు మళ్ళీ హైకోర్టు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తుందనే ఆసక్తి మొదలైంది. తీవ్రత తక్కువే అయినా కేసుల ఉపసంహరణేదో న్యాయస్ధానాల ద్వారానే జరగాలన్నది చీఫ్ జస్టిస్ భావన. ఎత్తేసిన కేసుల్లో జగన్ పై 15, ఎంఎల్ఏ సామినేని ఉదయభాను మీద 10, జక్కంపూడి రాజా మీద 2, ఎంపి మిథన్ రెడ్డి మీద 3 ఉన్నాయి.
అలాగే మంత్రి పేర్ని నాని మీద 1, ఎంపి అవినాష్ రెడ్డి మీద 1, ఎంఎల్ఏలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, బ్రిజేంద్రనాదరెడ్డి, జోగిరమేష్ మీద చెరో కేసును ప్రభుత్వం ఏకపక్షంగా ఎత్తేసింది. మరి ఇలా ఎత్తేసిన కేసులను హైకోర్టు ఎప్పుడు రీ ఓపెన్ చేయిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ఉదయభాను మీద ఎత్తేసిన కేసులను పదిరోజుల తర్వాత విచారణ మొదలుపెట్టనున్నట్లు హైకోర్టు ప్రకటంచింది. మరి మిగిలిన కేసుల రీ ఓపెన్ ఎప్పుడన్న విషయాన్ని కూడా ప్రకటిస్తే బాగుంటంది.