థియేటర్ల టిక్కెట్ల రేట్లను తగ్గించమంటే సొంత కులపు వాళ్లతో తిట్టిస్తారా? థియేటర్లు మీకున్నాయా నాకున్నాయా? వైసీపీ నేతలకు భయం ఏంటో నేర్పిస్తా. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతా అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజకీయాల్లో ఓ కులానికి చెందిన నేతను అదే కులం వ్యక్తితో తిట్టిస్తారా..? కాపు కులం వాళ్లతోనే ఎందుకు? అందరితోనూ తిట్టించవచ్చు కదా..? రాష్ట్రమంటే రెండు కులాలు కాదు.. వర్గపోరుతో రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారు, మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని పవన్ తనదైన శైలిలో విమర్శించారు.
నేను సినిమాలను వదిలేయడం పెద్ద విషయం కాదు.. నా కోసం కాదు.. పది మంది కోసం నేను సినిమాలు చేస్తున్నా అన్నారు పవన్ కల్యాణ్.
సాటి మనిషికి అన్యాయం జరిగితే.. స్పందించే గుణం నాలో ఉంది. అందుకే మీ పనికిమాలిన పని వల్ల వేలాది థియేటర్ సిబ్బంది, యజమానులు, తెలుగు సినిమాపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తోంది. అందుకు ఇది మంచిది కాదని చెబితే… మీ నాటకాలను బయటపెడితే నన్ను బూతులు తిట్టిస్తారా?
మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి.. ప్రజాస్వామ్య పద్ధతిలోనైనా సిద్ధం. లేదా మరో విధంగా కావాలంటారా… దానికీ రెడీ. మీరు తిట్టే కొద్దీ ఇంకా బలపడుతాను. సమస్యలని ప్రస్తావిస్తే.. మా ఆడపడుచుల గురించి మాట్లాడతారా..?. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా’ అంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అయినా వైసీపీ వాళ్లు మాట్లాడ్డం ఎప్పుడు నేర్చుకుంటారు..? అరవడం తప్ప అంటూ పవన్ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.