యూకే ..బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలలో లేబర్ పార్టీ తరఫున మన తెలుగుబిడ్ణ బరిలోకి దిగుతున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్‌నాగరాజు ‘నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్’ నుంచి పార్లమెంటరీ అభ్యర్థిగా లేబర్ పార్టీ నుండి పోటీకి దించుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. బౌండరీ కమిషన్ సిఫారసుల మేరకు బ్రిటన్‌లో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది.
సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఉదయ్‌నాగరాజు కు హన్మంతరావు, నిర్మలాదర్ తల్లిదండ్రులు. ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పాలనా శాస్త్రంలో ఉదయ్ పీజీ చేశారు. సమాజం, భావితరాలపై ఆర్టిఫిషిల్ ఇంటలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన ఏఐ పాలన్ లాబ్స్ అనే థింక్-ట్యాంక్‌ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు.
క్షేత్రస్థాయి సమస్యలపై మంచి పట్టున్న ఆయన సూల్ గవర్నర్‌గా, వలంటీర్‌గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా పేరుపొందారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవాకాశాలున్నట్లు అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల జరిగిన కౌన్సిలర్, స్టేట్స్ మేయర్ ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో ఉదయ్ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది.