సౌత్ స్టార్ బ్యూటీ సమంత `సిటాడెల్` దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో పలుమార్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రచారం మరోసారి ఊపందుకుంది. ప్రస్తుతం సమంత సినిమాలే కాకుండా వ్యాపర రంగంలోనూ సత్తా చాటుతోంది. అందులో భాగంగా కొన్ని నెలల క్రితం చెన్నై సూపర్ ఛాంప్స్ జట్టును కొనుగోలు చేసిన సమంత.. తాజాగా పికిల్‌బాల్ టోర్నమెంట్ టోర్నీ ప్రారంభోత్సవంలో పాల్గొంది.
అయితే ఒంటరిగా కాదండోయ్.. జంటగానే. అవును, స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్‌బాల్ టోర్నమెంట్ లో సమంత మెరిసింది. తన టీమ్ కు మద్దతుగా నిలిచి.. ప్లేయర్స్ తో సందడి చేసింది. టోర్నమెంట్ కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో సమంత పంచుకోవడంతో ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. పైగా సమంత షేర్ చేసిన పిక్స్ లో.. ఆమె రాజ్ చేతిని పట్టుకుని కనిపించిన ఒక ఫోటో మరింత హైలెట్ గా నిలిచింది.
ఇప్పుడు ఆ ఫోటోనే రాజ్ – సమంతల రొమాంటిక్ కనెక్షన్ గురించి విస్తృత చర్చకు దారితీసింది. రాజ్ తో డేటింగ్ సమంత కన్ఫార్మ్ చేసేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రచారంపై రాజ్, సమంత ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అన్నట్లు రాజ్ కు ఆల్రెడీ పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు.
కాగా, దర్శకద్వయం రాజ్ & డీకే డైరెక్ట్ చేసిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో సమంత యాక్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ సమయంలోనే రాజ్ తో సమంతకు పరిచయం ఏర్పడింది. అనూహ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదలైన కొద్ది రోజులకే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఇక `సిటాడెల్: హనీ బన్నీ` కోసం రాజ్ & డీకేలతో కలిసి మరోసారి వర్క్ చేసిన సమంత.. ఇప్పుడు వారి ప్రొడెక్షన్ లోనే `రక్త బ్రహ్మాండ్- ది బ్లడీ కింగ్ డమ్` అనే మరో వెబ్ సిరీస్ చేస్తోంది.
View this post on Instagram