ఓ ఐటీ ఉద్యోగి జీతమెంతో తెలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా షాక్ అయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం లో ఈ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం అన్నమయ్య జిల్లాకు వెళ్లారు ముఖ్యమంత్రి. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో చంద్రబాబు కాసేపు చిట్ చిట్ చేశారు.
ఈ క్రమంలోనే ఓ టెకీ తనను తాను పరిచడం చేసుకున్నాడు. తన పేరు యువరాజు యాదవ్ అని, బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగినని, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని తెలిపాడు. కటింగ్స్ పోగా నెలకు వచ్చే జీతం రూ. 6.37లక్షలు.. ఏడాదికి రూ. 93 లక్షలు అని యువరాజు యాదవ్ చెప్పడంతో.. చంద్రబాబుతో సహా అక్కడున్న వారంతా షాకైపోయారు.
వెంటనే చంద్రబాబు కలగజేసుకుని ఎంత వస్తుంది మరోసారి చెప్పమ్మా అనగా.. యువరాజు యాదవ్ ఏడాదికి రూ. 93 లక్షలు ప్యాకేజీ సార్ అని బదులిచ్చాడు. దాంతో `ఇంటి దగ్గర కూర్చుని సంవత్సరానికి 93 లక్షలు సంపాదిస్తున్న యువరాజ్ కి గట్టిగా చప్పట్లు.. ఐయామ్ ఫ్రౌడాఫ్ హిమ్` అంటూ చంద్రబాబు ప్రశించారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్న అసలు రచ్చ ఆ తర్వాత మొదలైంది.
యువరాజ్ అబద్దాలు చెబుతున్నాడని సోషల్ మీడియాలో కొందరు అతన్ని ట్రోల్ చేయడం షురూ చేశారు. దాంతో యువరాజ్ ట్రోలర్స్ కు గట్టి జవాబు ఇచ్చాడు. తాను ఓ ప్రముఖ కంపెనీకి జనరల్ మేనేజర్ హోదాలో ఉన్నానని.. తనకు 14 ఏళ్ల అనుభవం ఉందని యువరాజ్ పేర్కొన్నారు. సీఎం మీటింగ్ లో తనకు ఏడాదికి రూ. 93 లక్షల ఫ్యాకేజీ అని చెప్పింది అక్షరాల నిజమని స్పష్టం చేశారు. తాను 30 శాతం ట్యాక్స్ కడుతున్నట్లు కూడా యువరాజ్ ఆధారాలు చూపించాడు. అనవసరంగా ట్రోల్స్ చేయొద్దంటూ హెచ్చరించారు.
పేదవాడు కష్టపడి సంపాదించుకుంటుంటే అక్కసుతో రగిలిపోతున్న వైసీపీ పెత్తందారులు. ఎన్నారై లు అని చెప్పుకునే వైసీపీ పెత్తందార్లు కూడా ఈ బీసీ బిడ్డ పై పడి ఏడుస్తున్నారు.
అతనికి ఉన్న నాలెడ్జ్ తో, స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ, కష్టపడి సంపాదించుకునే డబ్బు ఇది. ఇవిగో ప్రూఫ్స్
ఒక బీసీ యాదవ్… pic.twitter.com/kgODCHuksJ
— Telugu Desam Party (@JaiTDP) February 1, 2025