• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమెజాన్ ను తలదన్నే డీప్ సీక్ తెలుసా?

admin by admin
January 28, 2025
in Around The World, Top Stories
0
0
SHARES
39
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నంతనే గుర్తుకు వచ్చేవి చాట్ జీపీటీ. అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన ఈ టూల్ ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలిసిందే. దీని తర్వాత మైక్రోసాఫ్ట్.. గూగుల్.. మెటా.. అమెజాన్ లాంటి సంస్థలు ఏఐలోకి ఎంట్రీ ఇవ్వటం.. వీటి పుణ్యమా అని యావత్ ప్రపంచం ఇప్పుడు ఏఐ మీద ఫోకస్ చేసింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. ఏఐ ఆవిష్కరణలు చేసిన కంపెనీలన్నీ అగ్రరాజ్యం అమెరికాకు చెందినవే. ఏఐ రంగంలో అమెరికాదే అధిపత్యం. ఇలాంటి వేళ.. ఊహించని విధంగా డ్రాగన్ దేశం నుంచి దూసుకొచ్చింది ‘డీప్ సీక్’. ఇది కూడా మిగిలిన ఏఐ టూల్ మాదిరే.

చైనాకు చెందిన ఈ స్టార్టప్ సంస్థ ఇప్పుడు టెక్ ప్రపంచంలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారటమే కాదు.. అమెరికా స్టాక్స్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చైనాలోని హాంగ్జౌకు చెందిన ఏఐ రీసెర్చ్ సంస్థ డీప్ సీక్ ను 2023లో లియాంగ్ వెన్ ఫెంగ్ స్టార్ట్ చేశారు. ఇతగాడు చేసిన పనేమిటంటే.. చైనాలోని ప్రముఖ వర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లతో ఒక టీంను ఏర్పాటు చేసుకొని.. ఏఐపై రీసెర్చ్ చేశారు. దీనికి ఫలితంగా ఆర్1 పేరిట ఏఐ మోడల్ ను ఆవిష్కరించిందీ సంస్థ.

మిగిలిన ఏఐ సంస్థలకు భిన్నంగా దీన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఏఐ సేవలు అందించే ఓపెన్ ఏఐ.. క్లౌడ్ సోనెట్ సంస్థలు సబ్ స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తున్నాయి. అలాంటిదేమీ లేకుండా కొన్ని సంస్థలు ఏఐ మోడళ్లను అందిస్తున్నాయి. మిగిలిన వాటికి ఉన్న పరిమితులకు భిన్నంగా డీప్ సీక్ ఉండటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. దీన్ని రూపొందించేందుకు సదరు సంస్థ చాలా తక్కువ ఖర్చు చేయటం గమనార్హం.

ఏఐ మోడళ్ల కోసం ఓపెన్ ఏఐ.. గూగుల్.. మైక్రోసాఫ్ట్ సంస్థల బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తున్నాయి. అందుకు భిన్నంగా డీప్ సీక్ మాత్రం కేవలం 6 మిలియన్ డాలర్లతో ఈ ఏఐ లేటెస్ట్ వెర్షన్ ను రూపొందించాయి. ఈ సంస్థతో పోలిస్తే ఇతర కంపెనీలు దాదాపు 30 రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ఓపెన్ ఏై ఓ1 మోడల్ తో పోలిస్తే మ్యాథ్స్.. కోడింగ్.. రీజనింగ్ లాంటి అంశాల్లో మిగిలిన వాటికి సమానంగా పని తీరును కనపర్చటం విశేషం. సోషల్ మీడియాలో దీనిపై జరుగుతున్న చర్చతో ఈ సంస్థమీద అందరి చూపు పడటంతో.. ఇదో హాట్ టాపిక్ గా మారింది.

దీని పని తీరును చూస్తున్న వారు ముగ్థులు అవుతున్నారు.దీనికి ప్రాచుర్యం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. యాపిల్ యాప్ స్టోర్ లోనూ డీప్ సీక్ దూసుకెళుతోంది. అమెరికా.. యూకే.. చైనాలో టాప్ ఫ్రీ అప్లికేషన్ జాబితాలో ఓపెన్ ఏఐను డీప్ సీక్ దాటేయటం గమనార్హం.అంతేకాదు.. అమెరికా టెక్ పరిశ్రమను కుదిపేస్తోంది. ఎన్విడియాతో పోలిస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్ తో తాము ఏఐ మోడళ్లను తయారు చేశామని కంపెనీ పేర్కొన్న నేపథ్యంలో.. ప్రీ మార్కెట్ ట్రేడ్ లో ఎన్విడియా షేరు 14 శాతం.. మైక్రోసాఫ్ట్ షేరు 7 వాతం.. మెటా 5 శాతం నష్టాలు చవిచూశాయి.

టెక్ ఆధారిత కంపెనీలతో కూడిన నాస్ డాక్ నాలుగు శాతం మేర కుంగిన వైనం చూస్తే.. చైనా నుంచి వచ్చే అప్డ్ డేట్స్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్న సత్యనాదెళ్ల వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. డీప్ సీక్ ప్రభావం దిగ్గజ కంపెనీల మీద ఎంత ఉందన్న దానికి సత్యనాదెళ్ల మాటలు ఉదాహరణగా చెబుతున్నారు. దీన్ని ఏఐ స్పుత్నిక్ మూమెంట్ గా కొందరు వర్ణించటం చూస్తుంటే.. అమెరికన్ ఏఐ సంస్థలకు సరికొత్త సవాలు విసురుతుందనటంలో ఎలాంటి సందేశం లేదు.

మరి.. దీన్ని లాగిన్ కావాలంటే చాలా సింఫుల్.. chat.deepseek.com అని టైప చేసి మొయిల్ ఐడీతో లాగిన్ అయితే.. డీప్ సీక్ ప్రపంచంలోకి వెళ్లిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఒకసారి ట్రై చేయండి.

Tags: chat gptchina's inventiondeepseekUSA
Previous Post

మాట తప్పను.. కానీ, జగన్ లా చేయలేను: చంద్రబాబు

Next Post

`సూప‌ర్ సిక్స్‌`పై చంద్ర‌బాబు వివ‌ర‌ణ‌కు రీజ‌నేంటి?

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?

June 19, 2025
Around The World

వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Load More
Next Post

`సూప‌ర్ సిక్స్‌`పై చంద్ర‌బాబు వివ‌ర‌ణ‌కు రీజ‌నేంటి?

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra