చేపట్టిన పనిని పూర్తి చేయాలన్న లక్ష్యం.. దానిని సాధించాలన్న లక్ష్యం మెండుగా ఉండే సైనికులు దారి తప్పారు. అదికూడా ఎన్నో కఠిన నియమాలు అమలు చేసే దేశంగా పేరున్న ఉత్తర కొరియా సైనికులు కావడం గమనార్హం. వీరంతా రష్యాకు అనుకూలంగా.. ఉక్రెయిన్‌పై పోరాడేందుకు వెళ్లారు. నియంతగా పేర్కొనే కిమ్ జోంగ్ ఉన్ ఆదేశలతో ఉత్తర కొరియా సైనికులు.. తొలిసారి ఆ దేశాన్ని వీడి బయటకు వచ్చారు. అనేక కఠిన నియమాలు, నిబంధనలో పనిచేసే ఈ సైన్యం.. రష్యాలోకి అడుగు పెట్టింది.
ఇది జరిగిన నాలుగు మాసాలు అయింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా.. రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలిచింది. ఈ క్రమంలోనే 4వేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాకు చేరుకున్నారు. ఈ క్రమంలోవారికి మరింత కఠోర శిక్షణ, అధునాతన ఆయుధాల వినియోగంపై అవగాహన కూడా కల్పించారు. ఇక, వారు ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగబోతున్న సమయంలో అనూహ్యంగా ఉత్తర కొరియా సైన్యం గురించి బాంబులాంటి వార్త బయటకు వచ్చింది.
అదే.. శిక్షణా సమయంలో వారు.. గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి.. ఆన్లైన్లో పోర్న్ సైట్లు చూశారని.. ఫలి తంగా వారి ఏకాగ్రత దెబ్బతిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. బ్రిటన్ మీడియా కూడా దీనిని ధ్రువీకరించింది. “సైనికులంతా.. రాత్రి సమయంలో పోర్న్ చూడడంతోనే సమయాన్ని వెచ్చించారు. దీంతో వారి ఏకాగ్రత భగ్నమైంది“ అని బ్రిటన్ మీడియా స్పష్టం చేసింది.
కిమ్ సీరియస్?
తమ సైనికుల వ్యవహారంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సైనికులు పోర్న్ చూసింది కనుక నిజమైతే.. వారిని దేశంలోకి కూడా రాకుండా.. కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. అంటే.. మొత్తంగా సైనికులకు మరణ శిక్ష విధించడం ఖాయమని తెలుస్తోంది.
ఇలా ఎందుకు జరిగింది?
ఉత్తర కొరియా సైనికులు.. రష్యా కోసం యుద్ధం చేయడానికి వెళ్లి.. ఇలా పోర్న్ ఎందుకు చూశారన్నది ప్రశ్న. ప్రధానంగా ఉత్తర కొరియాలో నిర్బంధ `డేటా` ఉంటుంది. అంటే..ఎవరూ కూడా పరిమితికి మించి డేటా వినియోగించడానికి వీలుండదు. సైనికులకు అయితే.. ఇది మరింత నిర్బంధం. అదేసమయంలో ఏయే సైట్లను వీక్షిస్తున్నారనే అంశంపై అక్కడి ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఊపిరి బిగబట్టుకుని జీవించడమే. అందుకే.. ఉత్తర కొరియా సైనికులు రష్యాకు రాగానే.. స్వేచ్ఛ వచ్చినట్టుగా భావించి.. పోర్న్ సైట్లను తెగ చూసేశారు. ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.