సోషల్ మీడియా ట్రోలింగ్ ఎంత హర్ట్ చేస్తుందో చాలాసార్లు చూశాం. ఆ నెగిటివిటీని భరించలేక కొందరు సెలెబ్రిటీలు తమ అకౌంట్లను కూడా క్లోజ్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. అయినా ఇప్పటికీ కొందరు మారడం లేదు. ఏదో ఒకటి మాట్లాడి ఎవరో ఒకర్ని బాధపెడుతూనే ఉన్నారు.
రీసెంట్గా హీరోయిన్ నందితాశ్వేతకి కూడా బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్ ఎదురయ్యింది. ట్రోలింగ్కి, బాడీ షేమింగ్‌కి గురయ్యింది. నందిత ఇటీవల కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. అవి చూసి భలే ఉన్నావంటూ చాలామంది మెచ్చుకున్నారు. ఒక నెటిజన్ మాత్రం పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు.
నువ్వు చాలా లావుగా ఉన్నావు, ఆంటీలా కనిపిస్తున్నావు, నువ్వు నీ ఫిజిక్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది, వర్కౌట్లు బాగా చెయ్యి అంటూ ఏదేదో వాగాడు. దాంతో నందితాశ్వేతకి బాగా కోపమొచ్చింది. తన ఇన్‌స్టా స్టోరీలో అతని గురించి రాయడమే కాదు.. స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది.
‘ఎవరి బాడీ వారి ఇష్టం. నేను ఇప్పుడు ఎలా కనిపిస్తానో అలా ఉండటమే నాకు ఇష్టం. ఈ విషయంలో నాకు నీ సలహాలు అవసరం లేదు. నేనేం దేవతని కాదు. సాధారణ మనిషినే. నాకూ బాధలు, ఇబ్బందులు, ఫీలింగ్స్ ఉంటాయి. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారసలు’ అంటూ ఆవేశంగా రాసుకొచ్చింది నందిత. అందరూ ఆమెని సపోర్ట్ చేస్తున్నారు. నోరు జారిన నెటిజన్‌కి చీవాట్లు పెడుతున్నారు.