మ్యాడ్ మూవీతో మంచి గుర్తుంపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్.. రీసెంట్ గా తన రెండో చిత్రం `ఆయ్` తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, విద్యా కొప్పినీడి కలిసి నిర్మించిన ఈ సినిమాకు అంజి.కె.మణిపుత్ర దర్శకత్వం వహించారు. గోదావరి బ్యాక్డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తే.. వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న రవితేజ-హరీశ్ శంకర్ల మిస్టర్ బచ్చన్, పూరి-రామ్ల డబుల్ ఇస్మార్ట్, చియాన్ విక్రమ్ తంగలాన్ వంటి భారీ చిత్రాలతో పోటీ పడుడూ ఆయ్ రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఆయ్ మూవీపై ఆ మూడు చిత్రాల ప్రభావం గట్టిగా పడింది. కనీసం థియేటర్స్ కూడా సరిగ్గా దొరకని పరిస్థితి. కానీ రెండో రోజుకు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుని డిజాస్టర్ దిశగా దూసుకుపోతున్నాయి.
తంగలాన్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా.. కమర్షియల్ అంశాలు లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఇక మిగిలింది ఆయ్. ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రేమలో క్యాస్ట్ ప్రాబ్లమ్ ని కామెడీగా చూపించి ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచారు. టాక్ అనుకూలంగా ఉండటంతో ఆయ్ హంగామా మొదలైంది. ఫస్ట్ డే సరైన ఓపెనింగ్స్ రాబట్టలేకపోయినా.. రెండో రోజు నుంచి ఆయ్ మూవీకి అటు థియేటర్స్, ఇటు కలెక్షన్స్ భారీగా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 55 లక్షల షేర్ కలెక్షన్స్ రాబట్టిన ఆయ్.. 2వ రోజు రూ. 90 లక్షలు, 3వ రోజు రూ. 1.05 కోట్లు అందుకుంది. వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ. 2.70 కోట్ల షేర్, రూ. 4.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూల్ చేసి ఆల్మోస్ట్ హిట్ కొట్టేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లు కాగా.. నాలుగో రోజు కలెక్షన్స్ తో ఆయ్ క్లీన్ హిట్ గా నిలిచి లాభాల బాటపట్టబోతోంది. ఇక ఈ చిన్న సినిమా ముందు ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ చిత్రాలు తేలిపోయాయి. కోట్లలో ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఈ మూడు సినిమాల కలెక్షన్స్.. రెండో రోజు నుంచి లక్షలకు పడిపోయాయి.