తాజాగా వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొన్ని రోజులుగా కాం ట్రాక్టర్లు.. బిల్లుల కోసం పట్టుబడుతున్నారు. దీంతో పుంగనూరులో వీరితో భేటీ అయి.. వారిని సర్దిపుచ్చే ప్రయత్నం చేయాలని ఆయన నిర్ణయించారు. అయితే.. ఈ వ్యవహారం ముదిరింది. దీంతో దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు ఎంపీని నిర్బంధించారు. అయితే.. ఈ వ్యవహారాన్ని మిథున్ రెడ్డి రాజకీయంగా చూశారు. ఈ క్రమంలో నిర్బంధాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధికారంలో ఉందని వైసీపీ నాయకులను గృహనిర్బంధం చేస్తున్నారని.. ఫ్యాక్షన్ నియోజకవర్గా లను తలపించేలా పుంగనూరును మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కార్యకర్తలను పార్టీలో కి చేర్చుకునేందుకు వారి ఒత్తిడి చేస్తున్నారని, పోలీసు కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై రాజకీయ నేతలు తీవ్ర స్తాయి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో జరిగినవి మరిచిపోయారా? అంటూ.. మిథున్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు.
గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేరేందుకు వేధించారని గుర్తు చేస్తున్నారు. పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సహా అనేక మందిని వేధింపులకు గురి చేసి కేసు లు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదేసమయంలో పార్టీ కార్యకర్తలను, నేతలను కూడా.. గృహ నిర్బంధాలు చేసిన విషయాన్ని చెబుతున్నారు. విజయవాడలో పట్టాభిని అక్రమంగా అరెస్టు చేసినప్పు డు.. అర్థరాత్రి ఆయనపై పోలీసులు బల ప్రయోగం చేసినప్పుడు.. మీరు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.
నీతులు చెప్పడం సులువేనని.. కానీ, గతంలో చేసిన వైసీపీ పనులను అప్పట్లోఎంపీగా మిథున్‌రెడ్డి ఖండించి ఉంటే ఇప్పుడు మాట్లాడే అర్హత.. ప్రజలు వినిపించుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. కానీ, ఆనాడు పుంగనూరులో టీడీపీ జెండా ఎగిరితేనే రగిలిపోయిన తండ్రీ కుమారులు(పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి) ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఏదో చేస్తోందని అనడం అనాలోచితం.. అనవసర రాద్ధాంతమని చెబుతున్నారు. ఏదేమైనా.. గతాన్ని మరిచి.. ఇప్పుడు కుప్పిగంతులు వేయడం వల్ల.. ప్రయోజనం లేదని హితవు పలుకుతున్నారు.