పాఠశాలలో, కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ఉంటాయి.
బాల్యంలో తమకు చదువు చెప్పిన గురువులు….తమకు విద్యాబుద్ధులు చెప్పి ఇంతటివారిని చేసిన అధ్యాపకులు…సహ విద్యార్థులు…మిత్రులు…వీరందరినీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
దశాబ్దాల తర్వాతైనా సరే వారందరినీ మరోసారి కలిసి ఆ స్వీట్ మెమొరీస్ ను నెమరువేసుకోవాలని అనుకోని వారుండరు.
ఆ కోవలోనే బందరులో విద్యనభ్యసించిన విద్యార్థులంతా ‘మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక’ కార్యక్రమాన్ని 24 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన హైదరాబాద్ లో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
అయితే, ఈ సారి అమెరికాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.
బందరులో ఏ విద్యా సంవత్సరంలో, ఏ స్కూల్ లో విద్యనభ్యసించినా సరే మే 3వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కాలిఫోర్నియాలో జరగబోతోన్న ‘మీది బందరా?’ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానితులే.
సిలికాన్ వాలీ, కాలిఫోర్నియా మిలిపిటాస్ లోని ‘యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రా’లో జరగబోతున్న ‘మచిలీపట్నం’ పూర్వ విద్యార్థుల కలయిక’ కార్యక్రమాన్ని ఇక్కడి ఎన్నారైలు నిర్వహిస్తున్నారు.
సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియాలో స్థిరపడిన ‘బందరు పూర్వ విద్యార్థులు’ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే.
ఈ కార్యక్రమానికి హాజరు కాబోయే వారు కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫారం లింక్ ద్వారా తమ వివరాలు తెలియజేస్తే నిర్వాహకులు భోజన సదుపాయాలు కల్పించేందుకు సౌకర్యంగా ఉంటుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, రాబోయే వారు తమ సంసిద్ధతను తెలియజేస్తే వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తామని నిర్వాహకులు దొర రాజు(ఆలివ్ మిఠాయి షాప్), మద్దుల గిరీష్ కుమార్ తెలిపారు.
దయచేసి రిజిస్ట్రేషన్ చేయగలరు. https://forms.gle/HtRAQTXsy1GLcxt17