మంచు మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్.. ఈ మధ్యే దివంగత భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డిల రెండో కూతురు మౌనికను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ పెళ్లి మోహన్ బాబు కుటుంబానికి ఇష్టం లేదని.. అయినా మనోజ్ పట్టుబట్టి మౌనిను పెళ్లాడాడని జోరుగా ప్రచారం జరిగింది. మోహన్ బాబు పెళ్లికి వచ్చారే కానీ.. తండ్రిగా కొడుకు వివాహంంలో అన్నీ తానై అన్నట్లు వ్యవహరించకపోవడం సందేహాలు రేకెత్తించింది. ఇక మంచు విష్ణు అయితే తన భార్యా పిల్లలతో కలిసి మరీ గెస్టులో వచ్చి గెస్టులాగే వెళ్లిపోయాడు.
మోహన్ బాబు కంటే విష్ణు తీరు చాలా సందేహాస్పదంగా అనిపించింది. మామూలుగా కుటుంబ విషయాల గురించి సోషల్ మీడియాలో చాాలా పోస్టులు పెట్టే విష్ణు.. తమ్ముడి పెళ్లి ఊసే ఎత్తకపోవడం.. ఒక విష్ కూడా చేయకపోవడం.. పెళ్లి ఫొటోలేవీ షేర్ చేయకపోవడంతో సందేహాలు మరింత పెరిగిపోయాయి. కట్ చేస్తే ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో అన్నదమ్ముల మధ్య పెద్ద అగాథం ఏర్పడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా మనోజ్ పెట్టిన స్టేటస్ వీడియో కలకలం రేపుతోంది. అందులో విష్ణు ఒక వ్యక్తి మీదికి దూసుకెళ్తుండగా.. ఆపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో పెట్టి.. ఇదీ ఇలా ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను, బంధువుల్ని కొడుతుంటారండీ.. ఇదండీ సిచువేషన్ అని కామెంట్ చేశాడు.
వీడియోలో వినిపిస్తున్నది మనోజ్ వాయిసే అన్నది స్పష్టం. ఇదేదో పబ్లిసిటీ గిమ్మిక్ అనుకునేలా కూడా లేదు. విష్ణు భార్య వెరోనికా రెడ్డి.. జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహిత బంధువు అన్న సంగతి తెలిసిందే. కాగా భూమా కుటుంబం వైసీపీకి దూరమై టీడీపీలో ఉన్న నేేపథ్యంలో మౌనికను మనోజ్ పెళ్లాడటం వెరోనికకు ఇష్టం లేదని.. జగన్ వైపు నుంచి ఈ విషయంలో వ్యతిరేకత వచ్చిందని ఒక ప్రచారం నడుస్తోంది. విష్ణు వద్దన్నా కూడా వినకుండా మనోజ్ మౌనికను పెళ్లాడిన నేపథ్యంలో అన్నదమ్ముల ఘర్షణ వాతావరణం నెలకొందని.. ఈ క్రమంలోనే తాజా వీడియో బయటికి వచ్చిందని అంటున్నారు.