ఇప్పటికే ఉన్న తలనొప్పులు సరిపోనట్లుగా కొత్త ఉదంతం ఒకటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చుట్టుకుందా? అన్నది ఇప్పుడుప్రశ్నగా మారింది. ఒకవైపు కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నట్లుగా ఆరోపణలు రావటం.. మరోవైపు కొడుకు మంత్రి కేటీఆర్ కు పేపర్ లీకేజీ ఉదంతంలో తలబొప్పి కట్టిన వేళలో.. ఇవి సరిపోవనట్లుగా తాజాగా గులాబీ బాస్ తీరు పైనా.. ఆయన వ్యవహారశైలిని వేలెత్తి చూపించేందుకు వీలుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పైసాను పది రూపాయిలుగా చిత్రీకరించే యంత్రాంగం ఉన్న నేపథ్యంలో..కంటికి కనిపించేదాన్ని కూడా నమ్మలేని పరిస్థితి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఏడు సెకన్ల వీడియోలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మైకు పట్టుకొని ఉండటం.. సౌండ్ రాకపోవటంతో పక్కనే ఉన్నా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం మీద చరిచి.. సౌండ్ పెంచమని చెప్పు అన్న గులాబీ బాస్ మాటల చిట్టి వీడియోఇప్పుడు బయటకు వచ్చింది.
ఈ పోస్టు మీద క్యాప్షన్.. ‘సౌండ్ పెంచమని చెప్పరా దున్నపోతు?’ అంటూ రాసినా.. వీడియోలో మాత్రం ఆ మాట లేదు. కేవలం.. సౌండ్ పెంచమని చెప్పు అని మాత్రమే ఉంది. ఇదేమీ అభ్యంతరకరం కాదు కానీ.. ఆ సందర్భంగా తన చేత్తో మంత్రి ఎర్రబెల్లి భుజం మీద చరచటంపైనే అభ్యంతరకరమని చెప్పాలి. ఎంత స్నేహితుడైనా.. చరిచే విధానంలో ఉండే తేడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
గౌరవనీయులైన రాష్ట్ర మంత్రి విషయంలో.. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఈ తీరులోరియాక్టు కావటం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవహారశైలి సరిగా ఉండదనే దానికి నిదర్శనంగా ఈ వీడియో నిలుస్తుందని.. రాజకీయ ప్రత్యర్థుల చేతికి ఇదో ఆయుధంగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.
సౌండ్ పెంచమని చెప్పరా దున్నపోతా?
This is how KCR treats his Ministers 🤮🤮
— Bhavya🦩 (@unexpected5678) March 24, 2023