డబ్బులు వసూలు అంటే మామూలు విషయం కాదు.. పన్నుల వసూళ్లలో ఇవాళ్టికీ వెనుకంజలో ఉన్న నగర పాలక సంస్థలకు హైద్రాబాద్ ఓ ఆదర్శం. ఇక్కడ పన్నుల వసూళ్లలో ఖైరతా బాద్ టాప్ (199 కోట్లకుపైగా) .. ఛార్మినార్ (46 కోట్లకు పైగా) లీస్ట్. వీటి వివరం ఎలా ఉన్నాకూడా కేసీఆర్ వ్యూహం ఫలించి, బల్దియా అధికారుల కృషి ఫలించి మంచి ఫలితాలు అందుకుని అనూహ్య రికార్డు సృష్టించి ఆయనకు సంతృప్త స్థాయి విజయాలను అందించింది. ఆ విధంగా కేసీఆర్ ఒక్క రోజే (నిన్న ఒక్కరోజే) వంద కోట్ల పన్ను (ఆస్తి పన్ను) వసూలులో చేరి సరికొత్త రికార్డు నమోదు చేశారు.
జీహెచ్ ఎంసీ కి పండుగే పండుగ..కాసులే కాసులు.. ఆస్తి పన్నుల వసూళ్లలో కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ ను దాటేశారు. ఆయన నిర్దేశించిన లక్ష్యాలను దాటి, అదనంగా 142 కోట్లకు పైగా వసూలు చేసి సర్కారు వర్గాలను ఆశ్చర్యపరిచారు జీహెచ్ ఎంసీ వర్గాలు.
నిన్నటి వేళ ఒక్క రోజే వంద కోట్లు రావడంతో కేసీఆర్ వర్గాలు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఒక ప్రాంత అభివృద్ధిలో పన్నుల వసూళ్లే అత్యంత కీలకం కనుక ఇకపై హైద్రాబాద్ నగర పాలక సంస్థ మరింత వేగంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని ఆశించాలి.
బాహుబలి లాంటి సినిమా విషయంలోనూ లేదా ఇంకా ఏ ఇతర సినిమాల విషయంలో ఇలాంటి మాటలు వింటుంటాం కదా ! ఆ విధంగా కేసీఆర్ కూడా ఓ మంంచి రికార్డు నమోదు చేశారు. 2000 కు మందు తెలుగుదేశం ప్రభుత్వం వేసిన పునాదుల ఫలితాలు వాటిని అందిపుచ్చుకుని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ కార్యక్రమాలు ఈ ఫలితానికి కారణం.
కొంచెం సామాజిక బాధ్యత ఎక్కువ ఉన్నోళ్ల కారణంగానే పన్నుల వసూలు కూడా బాగుంటుంది. ఇదే ఆఫర్ ఆంధ్రాలోనూ ఉంది.. ఎర్లీ బర్డ్ ఆఫర్ కానీ ఇక్కడ అంతగా ఆశించిన ప్రగతి లేకపోవడం విచారకరం. శ్రీకాకుళంలోనూ ఈ ఆఫర్ ఉంది కానీ ఫలితం రాలేదు. ప్రచారం ఒక్కటే కాదు నిర్వహణ, ఆలోచనల అమలు కారణంగా కేసీఆర్ మంచి వృద్ధిని సాధించారు. ఇదే సందర్భంలో పన్నుల వసూళ్లలో ముఖ్యంగా ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ ఎంసీ చూపిన చొరవ ఇకపై అభివృద్ధి పై కూడా చూపిస్తే మంచి ఫలితాలే వస్తాయి.
హైద్రాబాద్ నగర పాలక సంస్థకు అద్భుతం అయిన ఆదాయం వచ్చింది. నిన్న ఒక్క రోజే వంద కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు కావడంతో కేసీఆర్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పన్నుల వసూళ్లకు జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. మొత్తంగా ఎర్లీ బర్డ్ ఆఫర్ సత్ఫలితాలు ఇచ్చింది. (ముందుగా పన్ను చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రిబేట్ అది కూడా ఏప్రిల్ నెలాఖరులోగా చెల్లించిన వారికి మాత్రమే.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే పన్ను చెల్లించే విధానంను ఎర్లీ బర్డ్ ఆఫర్ అని అంటారు)