హామీలు ఇవ్వడంలో, వరాలు ఇవ్వడంలో కేసీఆర్ ని మించిన వారు లేరు. ఏదైనా పార్టీకి క్లిష్ట పరిస్థితులు వచ్చాయని భావిస్తే లెక్కలేని వరాలిస్తడు కేసీఆర్. తాజాగా ఖమ్మం బీఆర్ఎస్ సభలో కూడా అదే జరిగింది.
ఇప్పటికే కేసీఆర్ హామీలు నోటి మాటలే గాని వాస్తవాలు కావని ప్రతిపక్ష పార్టీలు విమర్శించినా కేసీఆర్ తగ్గేదేలేదు అంటున్నాడు.
అయినా దేశ వ్యాప్తంగా కేసీఆర్ సాధించేది ఏమీ లేదు. కనీసం భారీ హామీలు ఇచ్చి పార్టీకి పబ్లిసిటీ అయినా తెచ్చుకుందామని ఈ ట్రిక్కులని కొందరు ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే అవి నిజమవుతాయా లేదా అన్నది పక్కన పెడితే… కేసీఆర్ అయితే… రెండు భారీ హామీలు ఇచ్చేశాడు.
దేశంలో బీఆర్ఎస్ ప్రతిపాదించిన ప్రభుత్వం వస్తే దేశం అంతా రైతులకి ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తాం. #BRSforIndia #AbkiBaarKisanSarkar #BRSParty #TelanganaModel pic.twitter.com/5b9duxxPQv
— Gandra Venkataramana Reddy (@Gandraofficial) January 18, 2023
#BreakingNews: #Telangana CM #KCR has announced that if #BRSParty comes to power at the Centre, he will cancel #IndianArmy's #Agnipath Scheme and will revert to the old system. He also promised free power to #India if he comes to power. #Khammam #TRS pic.twitter.com/n17ZzeFydt
— Krishnamurthy (@krishna0302) January 18, 2023
ఒకటి దేశమంతటా రైతులకు ఉచిత విద్యుత్
ఆర్మీ నియామకాల కోసం పెట్టిన కొత్త స్కీం అగ్నిపథ్ రద్దు.
ఈ రెండు దేశ వ్యాప్తంగా అత్యధికులు ఆసక్తి చూపేవే. అందుకే కేసీఆర్ వాటిని ప్రకటించాడు. నిజంగా ప్రధాని అయినపుడు చూద్దాం లే ఇచ్చేది హామీలేగా అనుకున్నాడేమో అని కొందరు అనుకున్నా కేసీఆర్ స్టైలే వేరు.