ఏపీ 175 – గుండుసూది పిన్ యూట్యూబ్ ఛానెల్స్‌తో చాలా తక్కువ టైంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా పాపులర్ అయ్యారు సీనియర్ జర్నలిస్టు మానెం శ్రీనివాసరావు. ఈనాడులో ఏలూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేసిన శ్రీనివాస్… అనంతరం సొంతంగా డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ సెట్ చేసుకుని ఏపీ, తెలంగాణలో రాజకీయ విశ్లేషణల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగులో కావాల్సినన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నా… చాలా ఛానెల్స్‌లో చాలా మంది విశ్లేషణలు చేస్తున్నా.. ఫ్యూర్ పొలిటికల్ విశ్లేషణలకు మాత్రం శ్రీనివాస్ ఛానెల్స్ పెట్టింది పేరు. ప్రతి రోజు శ్రీనివాస్ విశ్లేషణల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారు ఏపీ, తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు.
కేవలం డిజిటల్ మీడియా ద్వారా ప్రజలను రాజకీయంగా చైతన్య వంతులను చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను కూడా శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇతోధిక సాయం చేయడంతో పాటు ఇటీవల విజయవాడ వరదల సమయంలోనూ సొంతంగానే కాకుండా తన ఛానెల్ ఫాలోవర్స్ ద్వారా 2000 మందికి సరిపడా ఆహార పదార్థాలు, వస్త్రాలను రెండు విడతలుగా అందజేశారు. ఇక తన ఛానెల్ ఫాలో అయ్యే పేద విద్యార్థుల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే కూడా శ్రీనివాస్ ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయవాడలో నివాసం ఉండే మానెం శ్రీనివాస్, సతీమణి సూర్యకుమారి పలు పండుగల సందర్భంగా అన్న సమారాధన నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా కార్తీకమాసం బుధవారం ద్వాదశి సందర్భంగా శ్రీనివాస్ తల్లిదండ్రులు నివాసం ఉండే ఏలూరులోని సపోటా తోట.. రాజరాజేశ్వరి నగర్ మూడో లైనులో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెయ్యి మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వర స్వామి ఆలయం సిబ్బందితో పాటు చుట్టుపక్కల భక్తులు పాల్గొన్నారు.