ప్రతిపక్షాలను అణచివేయడానికి దొరికే ఏ అవకాశాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వదులుకోవడం లేదు. కందుకూరు ఘటనను జగన్ ఒక పెద్ద అవకాశంగా చూస్తున్నారు.
కందుకూరు, గుంటూరు ఘటనలను సీరియస్గా తీసుకున్న జగన్ ప్రభుత్వం వాటిని అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది.
తాజాగా ఈ ఘటనలపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషశాయన రెడ్డితో కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యుల పై ఈ కమిషన్ విచారణ చేయనుంది. ఇందులో ఏ నిజాలు బయటపెడతారో, ఏ నిజాలు దాస్తారో అందరికీ తెలుసు అని తెలుగుదేశం ఎద్దేవా చేసింది.