తక్కువ మాట్లాడే వారంతా జ్జానులు కాదు అని నిరూపించారు జగన్ రెడ్డి.
ముఖ్యమంత్రి అయ్యాక మొదటి మూడు లైవ్ మీట్లతోనే తన సత్తా ఏంటో చెప్పేశారు.
ఆ తర్వాత అన్నీ రికార్డెడ్ లైవులే.
గుండూరు నుంచి నిరారక్షిత వరకు ఆయన కనిపెట్టని తెలుగు పదం లేదు.
పోనీ తెలుగు పదాలు మాత్రమే తప్పు మాట్లాడతాడా అంటే కాదు కాదు… అసలు కొత్తవి కూడా కనిపెడతాడు.
ఉదా: అంబులెన్స్ ట్యాంకర్.
అసలు ఇలాంటిది ఒకటుంది కూడా ఎవరికి తెలియదు.
మరో ఉదా : కరోనా పుట్టింది కొరియాలో.
ఇలా అన్న అపార జ్జానాన్ని రికార్డెడ్ లైవులు కూడా దాచలేకపోయాయి.
తాజాగా ‘‘బెంగుళూరు ప్రజలకు కూడా తెలియని ఒక చారిత్రక వాస్తవాన్ని జగన్ బయటపెట్టారు.‘‘
విభజనతో ఏపీ చెన్నై నగరాన్ని కోల్పోయిందట.
హైదరాబాదు నగరాన్ని కోల్పోయిందట.
బెంగుళూరు నగరాన్ని కూడా ఏపీ విభజన వల్ల కోల్పోయిందట.
ఈ విషయం కన్నడిగులకు తెలిస్తే ఏకంగా ఉద్యమాలు చేస్తారేమో.
బెంగుళూరు ఏపీలో స్వాతంత్రానికి ముందు కూడా భాగం కాదు.
మరి అలాంటి బెంగుళూరును ఏపీ ఎలా కోల్పోయిందో.
చరిత్రకారులకే తెలియని ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి ఎలా కనిపెట్టారో ఎవరికీ అర్థం కావడం లేదు.
రేయ్ జఫ్ఫాస్ ..మీ తుగ్లక్ ఇంకో ఆణిముత్యం వదిలాడురో ????????????
హైదరాబాద్ , చెన్నయ్ , బెంగళూరు ఏపీ నుండి విభజన లో వెళ్లిపోయాయి అంట ???????????????????????????? pic.twitter.com/tAq1skBUmt
— Venu M Popuri (@Venu4TDP) May 20, 2021