అమరావతి విషయంలో తాను అనుకున్నది రివర్స్ అవడం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.
జగన్ అనుకున్నది వేరు, జరిగింది వేరు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా అన్ని ప్రాంతాల మీద ఒకే మమకారం కలిగి ఉండకపోవచ్చు. అయితే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ప్రాంతాన్ని ద్వేషించిన దాఖలాలు లేవు.
ఆ రికార్డు సాధించిన మొదటి ముఖ్యమంత్రి గా ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలిచారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబుపై అబద్ధాలు ప్రచారం చేయడం, జనాలకు ఉచితంగా డబ్బు పంచుతానని హామీలు ఇవ్వడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం అనే మూడు వ్యూహాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చాక జగన్ వ్యూహాలన్నీ జనానికి తెలిసిపోవడంతో ఆయనపై వారిలో అసంతృప్తి పెరిగింది. ఇది బయటపడకుండా పోలీసు వ్యవస్థను అడ్డంగా వాడుకుంటున్నారు. అధికార వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. చివరకు ఏకంగా పదవిలోకి వెళ్లడానికి కొద్దిరోజుల ముందు నేటి సీజే ఎన్వీరమణపై అవినీతి ఆరోపణలు చేసిన అడ్డుకునే ప్రయత్నం చేసి తీవ్రంగా విఫలమైనారు జగన్.
తను కలలు అన్నీ పటాపంచలు కావడంతో పాటు ఇపుడు లీగల్ గా తన నిర్ణయాలు వీగిపోతుండటంతో 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రాంతాల మధ్య విభజన అనే కొత్త వ్యూహాన్ని జగన్ రచిస్తున్నారు. దీనికి జగన్ ఏ మార్గాన్ని ఎంచుకున్నారు అనే షాకింగ్ రహస్యాన్ని ఏపీ హైకోర్టు న్యాయవాది ఒకరు బట్టబయలు చేశారు. దీంతో జగన్ ఆలోచన విధానం చూసి ఏపీ ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
అసలు జగన్ వేసిన కొత్త ప్లాన్ ఏమిటి? ఆయన ఆడుతున్న మైండ్ గేమ్ ఏమిటి? రాయలసీమను ఈ కుట్రలోకి ఎలా లాగారు అన్న విషయాన్ని లాయరు మాటల్లోనే వినండి.