దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నిజమైన వారసత్వం తనదేనని..తానే నిజమైన వారసురాలినని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు. “వైఎస్ ఆశయాలు నెరవేరుస్తానని చెప్పి.. 2019 ఎన్నికల సమయంలో జగనన్న హామీ ఇచ్చారు. మరి ఆయన ఆశయాలు నెరవేర్చాడా? అంటే లేదు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో 54 ప్రాజక్టులకు శ్రీకారం చుట్టారు. 12 ప్రాజక్టులను పూర్తి చేశారు. మరో 42 ప్రాజెక్టులు అలానే ఉన్నాయి. నిజమైన వారసుడు అయి ఉంటే..వాటిని పూర్తి చేసి ఉండాలి. కానీ చేయ లేదు. మరి ఆయనకు వారసుడు ఎలా అవుతారు?“ అని సీఎం జగన్ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.
కామెంట్లపై…
సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లపై ఇప్పటికే తెలంగాణలో సైబర్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేసిన విషయం తెలి సిందే. అయితే.. తాజాగా అనంతపురంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభలో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించా రు. సొంత చెల్లినని కూడా చూడకుండా జగన్ తనపై కామెంట్లు చేస్తున్నారని.. తాను డబ్బులు ఇచ్చి మరీ కొందరితో దూషణలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కోసం 3200 కిలో మీటర్ల మేరకు పాదయాత్ర చేశానన్నారు. పార్టీని నిలబెట్టానని అన్నారు. కానీ, ఇప్పుడుతనపైనే దుర్భాషలకు దిగుతుననారని విమర్శించారు.
ఏం తెచ్చారు?
సీఎం జగన్ అదికారంలోకివచ్చి 5 ఏళ్లు అయిపోయిందని.. ఈ ఐదేళ్ల కాలంలో ఏం తెచ్చారు? రాష్ట్రానికి ఏం చేశారు? అని షర్మి ల ప్రశ్నించారు. “ప్రత్యేక హోదా తెస్తానన్నారు. తెచ్చారా? పోలవరం పూర్తి చేస్తానన్నారు. చేశారా? విశాఖ మెట్రో తెస్తానన్నారు తెచ్చా? “ అంటూ సీఎం జగన్పై ప్రశ్నల వర్షం కురిపించారు. `ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని కోసం పోరాడుతున్న నాపైనా .. నా భర్తపైనా, నా కుటుంబ సభ్యులపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నానా బూతులు తిడుతున్నారు. ఇదేనా జగన్ పాలన“ అని షర్మిల నిప్పులు చెరిగారు. ఒకప్పుడు సమైక్యాంద్రకోసం పోరాడిన తాను.. ఇప్పుడుఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని చెప్పారు.
ఓట్లెలా అడుగుతారు?
గత 2019 ఎన్నికలకు ముందు.. మద్యం నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారని షర్మిల వ్యాఖ్యానించారు. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని కూడా చెప్పారని..ఇ ప్పుడు సీఎం జగన్ సొంతగా ప్రభుత్వం తరఫునే షాపులు ఏర్పాటు చేసి.. మందు అమ్ముతున్నాడని.. అన్నారు. ఇలాంటి సీఎం రేపు ప్రజల ముందుకు వచ్చి.. ఓట్లు ఎలా అడుగుతారని ఆమె నిలదీ శా రు. ఓట్లు అడిగే అర్హత జగన్కులేదని నిప్పులు చెరిగారు. “ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క మంచి ప నిచేశారా? రాజధానిని కట్టలేదు. మూడు రాజధానులు అన్నారు.. దానికీ దిక్కులేదు. మీ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? “ అని షర్మిల ప్రశ్నించారు.