ఇది మరో క్విడ్ ప్రో కో కి తెర లేపడం కదా?
ఆ కంపెనీ నష్టాల్లో ఉంది అనడానికి ఈ బాలన్స్ షీట్ నే ఆధారంhttps://t.co/6e6hSmBvURఈ లింక్ చూస్తే మీకే అర్థం అవుతుంది జగన్ గారి వ్యాపార దృక్పథం.
మొత్తానికి ప్రజలకి మాత్రం ఇసుమంతైన ఇసుక దొరికేనా ముఖ్యమంత్రి @ysjagan గారు..?#గోరంట్ల#ApforSale— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 21, 2021
అధికారపార్టీ నేతలకు ఈ విషయమే అర్ధం కావటంలేదు. ఇసుక రీచులు, అమ్మకం లాంటి అనేక అంశాలను సరైన మార్గంలో పెట్టడంలో ప్రభుత్వం ఫెయిలైనట్లే అనుకోవాలి. గృహనిర్మాణాలకు లేదా ఇతరత్రా అవసరాలకు ఇసుక దొరకక జనాలు నానా అవస్తలు పడుతున్నారు.
ఇదే సమయంలో లారీ ఇసుక లేదా ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాలంటే మధ్య తరగతి జనాలకు చుక్కలు కనబడుతున్నాయి. లారీ ఇసుక ధర అనధికారికంగా సుమారు 15-25 రూపాయల మధ్య ఉందని జనాలు చెప్పుకుంటున్నారు.
నిజానికి ప్రకృతి సిద్ధంగా దొరికే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేతలకు ఒక ఆదాయ మార్గంగా వాడుకోవడం మొదలుపెట్టారు.
చంద్రబాబు వచ్చాక ఇలా నేతలు దోచుకోవడానికి వీలు లేదని దానిని డ్వాక్రా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి వాడాలని ప్రయోగాత్మకంగా ఇసుక అమ్మకాలను మొదలుపెట్టారు. అది అంత సఫలం కాకపోవడంతో వెంటనే ఇసుక ఉచితం అని ప్రకటించారు. దీంతో ఇసుక ప్రజలకు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది.
అయితే… ఇసుక రీచ్ నుంచి మన ఇంటిదాకా రావడానికి అయ్యే ఖర్చును ఎవడో లారీ వాడు తీసుకుంటే అది టీడీపీ దోచుకుంటోంది వైసీపీ తెలుగుదేశంపై ఆరోపణలు చేసింది… పదేపదే వైసీపీ చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మారు. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడంలో జగన్ అప్పట్లో సక్సెస్ అయ్యారు.
కట్ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక కానీ అసలు దోపిడీ మొదలైందే జగన్ హయాంలో అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఎందుకంటే ఇసుక అంత కాస్ట్లీ అయ్యింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక ఆదాయం మీద పడ్డారు. ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు ఆదాయ మార్గంగా మలిచారు. దీంతో ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంలో జగన్ సర్కారు దారుణంగా విఫలమైంది.
కొత్త పాలసీ ముసుగులో ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి ఇసుక pic.twitter.com/pX3xdnnmx0
— JanaSena Party (@JanaSenaParty) March 21, 2021
టీడీపీ హయాంలోని జగన్ చేసిన అబద్ధపు ఆరోపణలే ఇపుడు జగన్ కి బూమ్ రాంగ్ అయ్యాయి. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకు ఇసుక రీచులన్నవి కల్పతరువులాగ తయారైందనే ఆరోపణలు మరింతగా పెరిగిపోయింది. దాంతో ఇసుక వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది.
ఇలాంటి తలనొప్పులను వదిలించుకునేందుకు ప్రభుత్వం మొత్తం రీచులను కాంట్రాక్టు పద్దతిన ఢిల్లీలోకి జయప్రకాశ్ వెంచర్స్ కు అప్పగించింది. దీంతో ప్రజలకు ఇసుక బంగారమైపోయింది. దీంతో ప్రభుత్వంపై జనాలకు చాలా కోపం ఉంది.
జనాలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని జగన్ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా ఇసుక సరఫరాను స్ట్రీమ్ లైన్ చేస్తే జనాలు సంతోషిస్తారు. 3 సార్లు ప్రయత్నించినా ఇసుక మరింత కాస్ట్లీ అవుతుందే గాని ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు.
"లిక్కర్-ఇసుక" మాఫియా డాన్ గా వ్యవహరిస్తున్న జగన్! సాక్ష్యాధారాలతో బయటపెట్టిన టీడీపీ నేత పట్టాభి pic.twitter.com/tZUr9gKllv
— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) March 21, 2021