సరిగ్గా దసరా సమయంలో ఎన్నికల హడావుడి.
పండగ సమయంలో కల్వకుంట్ల ఫ్యామిలీకి పండగ సరదా హుష్ కాకి.
ఈటెల గెలవడం అంటే 2023 ఎన్నికల్లో తాను ఓడిపోవడం కింద లెక్క.
అందుకే ఈసారి కేసీఆర్ కు పండగ సంబరం జీరో
ఎందుకంటే అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబరు 30వ తేదీన ఎన్నిక జరగనుంది.
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తప్పుకున్న ఈటెల రాజేందర్ అనంతరం తన ఎమ్మెల్యే పదవికి .. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ కురాజీనామా చేసేయటం తెలిసిందే.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా సుపరిచితమై.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆయనపై వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దశాబ్దాల కాలంగా కేసీఆర్ తో కలిసి చేసిన ప్రయాణం పక్కకు వెళ్లి.. సగటు రాజకీయ ప్రత్యర్థిగా మారారు.
అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వస్తుందని భావించినా.. వాయిదా పడేలా చేయటంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారన్న మాట ఈ మధ్యన వినిపించింది. తాజాగా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయటం ద్వారా.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగేలా చేశారు.
తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం చూస్తే.. అక్టోబరు 30న ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబరు 2న లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితం వెల్లడి కానుంది.
నోటిఫికేషన్ ను అక్టోబరు 1న విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబరు 8 వరకు గడువు ఉంది. అక్టోబరు 11న నామినేషన్ పరిశీలన.. ఉపసంహరణకు అక్టోబరు 13 వరకు గడువు ఉండనుంది. మొత్తంగా చూస్తే.. దసరాకు ముందుగామొదలయ్యే ఉప ఎన్నిక హడావుడి దీపావళి పండక్కి కాస్త ముందుగా ఫలితం తేలిపోనుంది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మినహా అధికార టీఆర్ఎస్.. విపక్ష బీజేపీ తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించటం తెలిసిందే.