ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ హయాంలో నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనీపాటా లేకుండా వేసే ఇలాంటి పిటిషన్లను ఎంటర్టైన్ చేయబోమని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు సిద్ధ మైన సీనియర్ న్యాయవాదిపై మండిపడింది. నోరెత్తితే.. భారీ జరిమానా విధిస్తాం.. అని హెచ్చ రించింది. ఆ వెంటనే సదరు పిటిషన్లను కొట్టి వేసింది.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో రాజకీయ కక్షసాధింపు క్రమంలో అప్పటి విపక్ష నాయకుడు చంద్రబాబుపై కేసులు పెట్టారన్న టీడీపీ విమర్శల గురించి తెలిసిందే. వీటిలో ఫైబర్‌నెట్ కుంభకోణం, భూముల కుంభకోణం, అమరావతి రింగ్‌రోడ్డు అలైన్‌మెంటు మార్పు వంటిఅనేక కేసులు ఉన్నాయి. అయితే.. వీటిని వెనక్కి తీసుకునేందుకు కూటమి సర్కారు ఇటీవల నిర్ణయించింది. దీంతోఆయా కేసులను సీబీఐకి అప్పగించి.. విచారణ జరిగేలా కోరుతూ.. బీ. బాలయ్య అనే హైకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
చంద్రబాబుపై ఏడు కేసులు నమోదయ్యాయని, వాటిని సీబీఐకి బదిలీ చేయాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. మంగళవారం ఈ పిటిషన్లు విచారణకు రాగానే.. న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది మండి పడ్డారు. ఇవన్నీ తప్పుడు పిటిషన్లేనని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించేందు కు రెడీ అయిన.. సీనియర్ లాయర్ మణీందర్ సింగ్‌పై న్యాయమూర్తి మండిపడ్డారు.
“ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా?“ అని ప్రశ్నించారు. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని ఊహించలేదన్నారు. ఒక్క మాట మాట్లాడినా.. భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పనీపాటా లేని పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.