ఉమ్మడి ప్రకాశం జిల్లా పేరు చెపితేనే అధికార వైసీపీకి కంచుకోట. పార్టీ ఓడిపోయిన 2014 ఎన్నికల్లోనూ జిల్లాపరిషత్ చైర్మన్ పదవితో పాటు ఒంగోలు ఎంపీ సీటు, మెజార్టీ అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. అలాంటి చోట ఇప్పటకీ పార్టీ బలంగా ఉన్నా పార్టీ అధినేత జగన్ , జిల్లా పరిశీలకులు చేస్తోన్న తప్పులు, ఐ ప్యాక్ రాంగ్ నివేదికల నేపథ్యంలో పార్టీకి బిగ్ డ్యామేజ్ జరుగుతోంది. చీరాలలో ఇండిపెండెంట్‌గానే గెలిచి అక్కడ నీళ్లల్లో ఉన్న మొసలి అంత బలంతో ఉన్న ఆమంచిని పరుచూరుకు పంపారు. ఆమంచికి చీరాల ఇస్తే గెలుపు డ్యామ్ షూర్.
టీడీపీ నుంచి తెచ్చుకున్న కరణం బలరాం గ్రిప్ అంతా అద్దంకిలోనే… వాళ్ల ఫ్యామిలీకి అద్దంకి కాదని చీరాలలో పెత్తనం ఇచ్చాక ఇక్కడ పార్టీ ఘోరంగా దెబ్బతింది. అద్దంకిలో కరణం ఫ్యామిలీని కాదనుకుంటే గత నాలుగేళ్లుగా పార్టీని నడిపిస్తోన్న బాచిన కృష్ణచైతన్యను కాదని.. ఎక్కడో పల్నాడు జిల్లా నుంచి హనిమిరెడ్డిని దింపారు. హనిమిరెడ్డి టీడీపీలో బలంగా ఉన్న గొట్టిపాటి రవిని ఎంత మాత్రం ఢీకొట్టలేని పరిస్థితి ఇప్పటికే ఉంది. ఎన్నికలకు ముందే అద్దంకి వైసీపీ చేతులెత్తేసిందంటున్నారు.
ఆమంచిని చివర్లో చీరాలకు మారిస్తే పరుచూరులో ఎవరిని పోటీకి దింపాలో కూడా తెలియని గందరగోళం ఉంది. యర్రగొండపాలెం నుంచి మంత్రి సురేష్‌ను కొండపికి మార్చినా గ్రూపుల గోలలో విలవిల్లాడుతున్నారు. యర్రగొండపాలెంకు బాలినేని చెప్పారని తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఇచ్చినా ఆయనకు స్థానిక కేడర్ సహకరించకుండా సురేష్ కావాలంటోంది. బాపట్ల జిల్లా వేమూరు నుంచి సంతనూతలపాడుకు షిఫ్ట్ అయిన మంత్రి మేరుగ నాగార్జునకు స్థానిక కేడర్ సహకరించబోమని తేల్చిచెపుతోంది. మాకు లోకల్ క్యాండెట్ కావాలని పట్టుబడుతోంది.
దర్శిలో మద్దిశెట్టిని పక్కన పెట్టడంతో ఆయన వర్గీయులు పార్టీకిదూరంగా ఉంటూ బూచేపల్లిని ఓడిస్తామంటున్నారు. కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కాదని హనుమంతునిపాడు జడ్పీటీసీ దద్దాల నారాయణయాదవ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో ఆయనది ఎమ్మెల్యేగా పోటీ చేసే స్దాయా ? సీటును బంగారుపల్లెంలో పెట్టి టీడీపీకి ఇచ్చేసినట్టే అని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. మార్కాపురం, గిద్దలూరు సీట్లు కూడా మారిపోయేలా ఉన్నాయి.
కొండపి నియోజకవర్గానికి చెందిన బోట్ల రామారావు యాదవ్‌కు కందుకూరు సీటు ఇవ్వడం స్థానిక పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇక్కడ గట్టిపట్టున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి వర్గం తెరముందు ఎలా ఉన్నా తెరవెనక రామారావుకు సహకరించడం లేదు. ఇటు ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని మాట జగన్ అస్సలు వినడం లేదు. చివరి వరకు ఆయన పార్టీలో ఉంటారా ? అసలు ఆయనకు సీటు ఉంటుందా ? ఒంగోలు ఎంపీ సీటు ఎవరికి దక్కుతుంది.. లోకల్‌ను కాదని నాన్ లోకల్‌కు ఎంపీ సీటు ఇస్తే జిల్లా వైసీపీ శ్రేణులు సహకరిస్తాయా ? అన్నది జవాబు లేని ప్రశ్న.
ఏదేమైనా పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్‌కు కంచుకోటగా ఉన్న ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల మార్పులు, అనాలోచిత నిర్ణయాలతో ఫస్ట్ టైం వైసీపీ చేజేతులా బలహీనపడుతోన్న పరిస్థితి ఉంది. జగన్ ఇప్పటకి అయినా ఏ నియోజకవర్గానికి ఎవరు సెట్ అవుతారు ? లోకల్, నాన్ లోకల్, ఒకచోట నుంచి మరోచోటకి స్థానచలనాలు ఆపి.. ఎవరు ఎక్కడ బలమైన అభ్యర్థో అక్కడే వారికి సీట్లు ఇస్తే తప్పా వైసీపీ ఈ సారి ఇక్కడ ఆధిక్యం చూపించే అవకాశాలు లేవు.